ప్రభుత్వ నిర్ణయం కరెక్టే…కానీ చంద్రబాబు, పవన్ లు వారి డ్యూటీలు చేస్తున్నారు….

Share Icons:

రాజమహేంద్రవరం: ఏపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ విశ్లేషుకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇంగ్లీష్‌ విద్యపై  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తప్పేమీ లేదని అన్నారు. తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి ఇంగ్లీష్‌ మాధ్యమంలో బోధిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తెలుగును సబ్జెక్టుగా కొనసాగించాలని సూచించారు. ఇసుక సమస్యను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులకు అవినీతి మకిలి అంటుకోలేదని పేర్కొన్నారు

అలాగే ఇసుక కొరత, ఇంగ్లీష్‌ అంశాలపై చంద్రబాబు, పవన్‌ వారి డ్యూటీలు వాళ్లు చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఈ సమస్యపై వివరణ ఇవ్వాలన్నారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడొద్దని సూచించారు. ఎంత మంది పెళ్లాలు.. మట్టికొట్టుకుపోతావన్న విమర్శలు అనవసరమని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై…పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీలు నోటీసులు ఇవ్వాలని కోరారు. కేంద్రాన్ని ఎంతకాలం అడిగినా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంకు బదులు ఇంగ్లీష్ ను ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయని, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సూచించారు. అంతేగానీ ఎన్ని పెళ్లిల్లు, ఎంత మంది  పెళ్లాలు, మట్టి కొట్టుకు పోతావనే విమర్శలు తగవని అధికార పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్షాలకు సూచించారు.

అంతకముందు ఏపీ సీఎం జగన్ కు ఉండవల్లి బహిరంగ లేఖ రాశారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఆ అన్యాయం గురించి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా గతంలో పార్లమెంట్ వేదికగా ప్రస్తావించారని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. 18 నుండి జరగనున్న శీతాకాల సమావేశాల్లో కచ్చితంగా ఏపీ విభజన అంశం ప్రస్తావనకు తీసుకు వచ్చేలా వైసిపి ఎంపీలు నోటీసులు ఇవ్వాలని ఆయన సూచించారు. పార్లమెంట్లో ఇప్పటివరకు ఏపీ విభజనపై చర్చ జరగలేదని, ఈ సారైన చర్చ జరిగేలా వైసిపి పట్టుబట్టాలని ఆయన తన లేఖ ద్వారా సీఎం జగన్ కు తెలిపారు

 

Leave a Reply