అది చంద్రబాబు మైండ్‌గేమ్…ఆయన్ని తక్కువ అంచనా వేయొద్దు..

Share Icons:

విశాఖపట్నం, 5 జనవరి:

తెలంగాణలో ఓటమి పాలైనా ఏపీ సీఎం చంద్రబాబును తక్కువ అంచనా వేయడానికి లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. చంద్రబాబు ఓ పోరాట యోధుడనీ, ఇటీవల పవన్ కల్యాణ్ పొత్తు కోసం ఆయన చేసిన వ్యాఖ్యలు మైండ్ గేమ్‌లో భాగమని వ్యాఖ్యానించారు.

ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ నష్టపోతుందని ఉండవల్లి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసుంటే కనీసం 50 స్థానాలు దక్కేవని వ్యాఖ్యానించారు.
కానీ తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు వికటించిందని అభిప్రాయపడ్డారు.

కేంద్రం ఇచ్చిన నిధులను ఎవరూ డైరెక్టుగా జేబులోకి వేసుకోలేరనీ, దుర్వినియోగం చేసే అవకాశం మాత్రం ఉంటుందని తెలిపారు. జగన్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందనీ, వైసీపీ శ్రేణులు దీన్ని క్యాష్ చేసుకోవాలని సూచించారు.

మామాట: చంద్రబాబు గురించి మీకు తెలుసు అనుకుంటా…

Leave a Reply