ఆ మాట పవన్ చెప్పాడు కాబట్టే ఈ మాత్రం స్పందన..

Share Icons:

రాజమహేంద్రవరం, 20 ఫిబ్రవరి:

రాష్ట్ర ప్రయోజనాలు కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవన్ కల్యాణ్ చెప్పాడు కాబట్టే ఈ మాత్రం స్పందన వచ్చిందని జేఎఫ్సీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

ఒకవేళ పవన్ చెప్పకపోతే రాజకీయ నేతలు నరేంద్ర మోదీపై భయంతో రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టిని పెట్టేవారు కాదని అన్నారు.

ఈరోజు ఆయన రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ….కేంద్రంపై జగన్ పెడతానన్న అవిశ్వాస తీర్మానాన్ని స్వాగతిస్తున్నాని, అలాగే దానికి చంద్రబాబు మద్దతు పలకాలని డిమాండ్ చేశారు.

అయితే కాంగ్రెస్‌, వైసీపీ కన్నా టీడీపీ అవిశ్వాసం పెడితేనే మరింత బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

ఇక పవన్‌, చంద్రబాబు మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లుగా తనకు అనిపించడం లేదని చెప్పారు. అలాగే అవిశ్వాసం అన్న పదం పవన్ నుంచి రాబట్టే, మీడియాలో ఇంత కవరేజ్ వచ్చిందని ఆయన అన్నారు.

మామాట:  స్వామి కార్యంకంటే స్వకార్యమే ఎక్కువ..

English summary:

JFC leader Undavalli Arun kumar said no confidence motion word comes from pawan kalyan. He also said the chandrababbu supports the jagan no confidence motion.

Leave a Reply