అనుచిత ‘ఉచిత’ తాయిలాలు

Share Icons:

చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించాలి అని చేనాలో సామెత ఉంది. ఆకలిగా ఉన్నవానికి మనం ఎన్నిరోజులు చేపలు ఇస్తాం. వాడికే పట్టుకోడం నేర్పితే… అవసరమైనపుడు వాడే చేపలు పట్టుకుంటాడు. మన అవసరం ఉండదు… అదే మన నేతల భయం కూడా అందుకే ఉచితాల నజరానా….

[pinpoll id=”66130″]

సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎన్నికలకు ముందే మాట మార్చినట్లు కనిపిస్తోంది. దీనికి తెలంగాణలోని వివిధ దినపత్రికల్లో ప్రచురితమవుతున్న కాంగ్రెస్ పార్టీ యాడ్స్ బలం చేకూరుస్తున్నాయి. మేనిఫెస్టోకు భిన్నంగా ఈ యాడ్స్ ఉండటం విమర్శలకు తావిస్తోంది. మేనిఫెస్టోలో 5 లక్షల ఆర్థికసాయం అని ప్రకటించగా.. యాడ్‌లో మాత్రం ‘ఇంటికోసం స్థలం ఉంటే డబుల్ బెడ్రూం రూమ్ ఇంటి నిర్మాణానికి పేదలకు రూ.5 లక్షల ‘రుణం’.. ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల ‘రుణం’ అంటూ.. ప్రచురించారు. మేనిఫెస్టోకి భిన్నంగా యాడ్స్‌లో రుణ ప్రస్తావన తేవడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ప్రజలను మోసగించడానికే కాంగ్రెస్ ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

అంతే కాదు.. సెక్యులర్ దేశంలో చర్చకీ, మసీదులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఏమిటి… మరి గుడులు, సిక్కుల ఆలయాలు ఏం పాపం చేశాయి. ప్రజల సొమ్ము ఇలా వివక్షతో ఖర్చు పెట్టవచ్చా. పైగా ముస్లీములకు మాత్రమే చికిత్స చేసే ఆసుపత్రులు నిర్మిస్తారట.. ఇటువంటి వాగ్ధానాలు ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతాయా.. ఎన్నికల సంఘం ఏంచేస్తోంది. కోర్టులు సుమోటోగా కేసునమోదు చేయడం లేదు ఎందుకో.. ఇంతకీ మారేమంటారు?

మామాట: ఉచిత హామీల పరిశీలనుకు జాతీయ స్థాయిలో నిపుణుల కమిటీ ఏర్పడాలి

Leave a Reply