ఇక సైకిల్ పై మిగిలింది ఇద్దరే….

Share Icons:

కే‌సి‌ఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరికొద్ది రోజుల్లో ఉమా మాధవరెడ్డి , సండ్ర వెంకట వీరయ్య కూడా సైకిల్ చక్రాన్ని వదిలి గులాబీ కారు ఎక్కబోతున్నారు. దీనికి డిసెంబర్ 9న ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తాజా సమాచారం.

నయీం వ్యవహారంలో కే‌సి‌ఆర్ ముందుగా ఇరికించాలని చూసింది ఉమా మాధవరెడ్డినే కదా.. ఒకప్పుడు టి‌ఆర్‌ఎస్ పార్టీ వాళ్ళు ఆవిడని పార్టీ లోకి ఆహ్వానించినా సైకిల్ వదిలేది లేదంటూ చెప్పింది. ముందు మొండికేసినా ఇప్పుడు వెళ్ళక తప్పేలా లేదు అనుకుందో ఏమో.. ఆవిడ కూడా ఇప్పుడు పసుపు జెండా వదిలేసి గులాబీ కండువా కప్పుకునేందుకు పచ్చ జెండా ఊపేసిందని, ఆవిడతో పాటు సండ్ర కూడా పార్టీ నుండి జంప్ అవుతున్నట్టు వార్తలు మారుమోగుతున్నాయి.

టీటీడీపీకి ఉన్న ఒకే ఒక ఆశాకిరణం రేవంత్ రెడ్డి వెళ్ళిపోయాక ఇలా మిగిలిన నాయకులంతా కాంగ్రెస్ చెంతకు, గులాబీ గూటికి చేరుతుండడంతో టీటీడీపీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఆర్. కృష్ణయ్య ఉన్నా లేనట్టే అని ఆ పార్టీలో అసమ్మతి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక చివరగా మిగిలింది ఇద్దరే.. ఎల్.రమణ, మోత్కుపల్లి నరసింహులు. ఈ ఇద్దరూ సైకిల్ కి ఉన్న రెండు చక్రాల మాదిరిగా మారి ఎంత వరకు పసుపు జెండా మోస్తారో చూడాలి.

 

మామాట:- పోనీలే,  కుమ్ములాటలకు తావు లేకుండా ఒకరు ఫ్లోర్ లీడర్ గానూ, మరొకరు ప్రసిడెంట్ గానూ మిగిలిపోతారు

Leave a Reply