ఆధార్ హ్యాకథాన్ లో పాల్గొని రూ.3 లక్షలు గెలుపొందే అవకాశం! వీరికి మాత్రమే!

Share Icons:
  • ఆధార్ హ్యాకథాన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
  • విజేతకు రూ.3 లక్షలు
  • రన్నరప్ కు రూ.2 లక్షలు
  • తర్వాతి రెండు టీమ్స్‌కు చెరో రూ.లక్ష
  • అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు
  • అక్టోబర్ 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
  • ఇంజినీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి

యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI లక్షలు రూపాయలు బహుమతిగా పొందే అవకాశం కల్పిస్తోంది. దీని కోసం ఆధార్ హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ప్రైజ్ మనీ ఉంటుంది. ఆధార్ హ్యాకథాన్ అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారం లక్ష్యంగా ఆధార్ ఈ హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది.

ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్, ఐడెంటిటీ అండ్ అథంటికేషన్ వంటి థీమ్స్ ఆధారంగా హ్యాకథాన్ ఉంటుంది. ఈ హ్యాకథాన్‌లో ఇంజినీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులు మాత్రమే పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఐదు మంది ఒక టీమ్‌గా ఏర్పడొచ్చు. ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరి.

ఆధార్ హ్యాకథాన్ విజేతకు రూ.3 లక్షలు అందిస్తారు. రన్నర్‌గా నిలిచిన వారికి రూ.2 లక్షలు వస్తాయి. తర్వాతి రెండు టీమ్స్‌కు రూ.లక్ష అందిస్తారు. అంతేకాకుండా ఆధార్ 2.0 గ్లోబల్ కాన్ఫరెన్స్‌కు ఈ టీమ్స్‌కు ఇన్విటేషన్ ఉంటుంది. ఇంకా సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.

మరిన్ని వివరాలు యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI వెబ్ సైట్ నందు లభిస్తాయి.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply