పత్రికలవన్నీ తప్పుడు వార్తలు… ట్రంప్

Share Icons:

అమెరికా, జూలై30,   “పత్రికల స్వేచ్ఛ వార్తలు ఖచ్చితంగా నివేదించవలసిన బాధ్యతను కూడా కలిగి ఉంటుంది,” అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఇటీవల ప్రధాన పత్రకల వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.

ట్రంప్ వ్యతిరేకత జబ్బుతో బాధపడే మీడీయా వర్గాలు ప్రచురించే అంశాల కారణంగా ఎందరిప్రాణాలో ఇబ్బందులలో పడుతున్నాయి. అందులో పాత్రికేయులు కూడా ఉన్నారని ట్రంప్ తెలిపారు.  వార్తలు ఇవ్వడంలో స్వేచ్ఛ అంటే వార్తలను నిస్పాక్షికంగా ఇవ్వడమనే బాధ్యత కూడా ఉంటుందని అమెరికా అధ్యక్షులవారు పేర్కొన్నారు.  నా పరిపాలన అద్భుత విజయాలు సాధిస్తున్నప్పటికీ దాని గురించి పత్రికలు రాస్తున్న వార్తల్లో 90 శాతం వ్యతిరేకత వ్యక్తపరిస్తున్నారని తెలిపారు.

మరణిస్తున్న వార్తాపత్రికా ప్రపంచం ట్రంప్ వ్యతిరేకత తో వ్యక్తం చేస్తున్న అసత్య ప్రచారాన్ని సాగనివ్వననికూడా ట్రంప్ హెచ్చరించారు. అవి ఎంతగా వ్యతిరేకతను చిమ్ముతున్నా, నా పాలనలో అమెరికా గొప్ప విజయాలను సాధిస్తోందని, అమెరికా ప్రజలకోసం తన పోరాటం విడిచిపెట్టే ప్రశ్నేలేదనీ ట్రంప్ పేర్కొన్నారు.  అమెరికా పాత్రికేయులకు అసలు దేశభక్తే లేదన్నారు. 

న్యూయార్క టైంస్, అమెజాన్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు చేసేదేమీలేక పోయినా, తన ప్రభుత్వం గురించిన వ్యతిరేకవార్తలు మాత్రం వ్రాస్తుంటాయని… అవి ఎప్పటికీ మారవనీ  ఆయన ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్లకు ముందు ఆయన తన అధికార నివాసంలో న్యూయార్క్ టైంస్ ప్రచురణ కర్త  షుల్జ్ బర్గర్ తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అయితే ఈ సమావశం గురించి ఇరువురు పరస్పర విరుద్దంగా ట్వీట్ చేశారు. పెయిడ్ న్యూస్ కు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు. అది విలేకరుల సహా చాలా మంది ప్రాణాలకు ప్రమాదంగా మారుతుందని మీడియాను హెచ్చరిస్తున్నట్టు ట్రంప్ ట్వీట్ చేయగా, గత మెరికా అధ్యక్షుల దారిలోనే ట్రంప్ కూడా పత్రికలను అదుపుచేయాలని, వాటిని భయపెట్టాలని చూస్తే అది తీవ్రపరిణామాలకు దారి తీస్తుందని తాను తెలిపినట్టు న్యూయార్క్ టైంస్ ప్రచురణ కర్త  షుల్జ్ బర్గర్ తన ట్విట్టర్ లో తెలిపారు.

మామాట: పత్రికలపై ఈ అక్కసు ఎందుకో రామచంద్రా..

Leave a Reply