అమెరికా-ఆంధ్రా.. ఒకటే తీరులో పత్రికలు

Share Icons:

తిరుపతి, జూలై 30,

“Freedom of the press also comes with a responsibility to report the news accurately,” he said accusing the mainstream media of wrongful coverage.

U.S. President Donald Trump has called American journalists “unpatriotic”, accusing them of putting lives at risk by their reporting.

“When the media – driven insane by their Trump Derangement Syndrome – reveals internal deliberations of our government, it truly puts the lives of many, not just journalists, at risk! Very unpatriotic!” Mr. Trump said in a series of tweets. (30.07.2018)

సోమవారం పత్రికలలో ప్రముఖంగా తమిళనాడు  మాజీ ముఖ్యమంత్రి, డిఎంకే సారధి కరుణానిధి అనారోగ్యం వార్త దర్శనమిచ్చింది. ఇవ్వాళ సజీవంగా ఉన్న దేశ రాజకీయ నేతల్లో కరణానిధి, వాజ్ పాయ్, అద్వానీ వంటి అతికొద్దిమంది ప్రజాక్షేత్రంలో అపజయం ఎరుగని నేతలు. వాజ్ పాయ్ ప్రస్తుతం ప్రజాప్రతినిధి కాదు. ఆదృష్ట్యా కరుణానిధి సీనియర్ రాజకీయనాయకుడు, ఆయన ఆరోగ్యంపై ఆందోళన వద్దని, కలైంజర్ కోలుకుటున్నట్లు ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్, ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి, కరుణను ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. గతంలో జయలలిత  చికిత్స విషయంలో జరిగినట్లు కాకుండా కరుణానిధి ఆసుపత్రిలో ఉన్న ఫోటోలను ఇపుడు మీడియాకు విడుదల చేస్తున్నారు. అయితే కరుణానిధి అపోలో ఆసుపత్రికి కాకుండా చిన్నదైన కావేరి ఆసుపత్రిలో చేరడంపై సామాజిక మాధ్యవాలలో జోకులు పేలుతున్నాయి. అందులో ఆలోచింపజేసేది…. గతంలో కావేరి(జలాల)కోసం కరుణానిధి పోరాటం జరిపారు- ఇపుడు కరణ కోసం కావేరి (ఆసుపత్రి పేరు) పోరాటం చేస్తోంది అన్నది.

సరే, ఇది అలా ఉంచితే గత కొంతకాలంగా మామాట చెబుతున్న మాటలనే నేడు అమెరికా అధ్యక్షుడి నోట వినవలసి రావడం కేవలం యాదృశ్చికమేనా.. అంటే కావచ్చును కానీ రెండు అంశాలలో కొంత వ్యత్యాసం ఉంది. మామాటలో వాక్యలపై ఎవరి మీదా కోపం గానీ, పక్షపాతం కానీ లేవు. అయితే అమెరికా అధ్యక్షుని వ్యాఖ్యలలో ఆయన పాలన పట్ల పత్రికలు సుముఖంగాలేవు అన్న ఆక్రోశం ధ్వనిస్తోంది. వర్తమాన పత్రికలు వార్తలను ఇవ్వడం లేదు, వారి ఉద్దేశాలను మాత్రమే రాస్తున్నాయి అన్నది మామాట చెబుతోంది. దానినే అమెరికా అధ్యక్షులవారు కూడా వెళ్లడించారు. కానీ పాత్రికేయులకు దేశభక్తి లేదు అని మామాట అనడం లేదు , అధ్యక్షుడు అంటున్నారు. అమెరికా ప్రభుత్వానికి , పాలకులకు వ్యతిరేకంగా రాస్తున్నవారికి ప్రాణహాని ఉండవచ్చునన్న ట్రంప్ వాఖ్యలు ప్రమాదకరమైనవి, బెదిరింపు ధోరణికి ఉదాహరణలు. అట్లా అని ట్రంప్ అభిప్రాయాలు పూర్తిగా తప్పు అని చెప్పలేని పరిస్థితి. పత్రికలు నేడు పెయిడ్ న్యూస్ అనే సాలెగూటిలో చిక్కుకున్నాయని ట్రంప్ అన్నది వాస్తవమే. మన దేశంలో , తెలుగులో కూడా గత కొంతకాలంగా ఈ చెల్లింపు వార్తలు రాజ్యమేలుతున్నాయి.  ఈ ధోరణి మంచిది కాదనీ, పత్రికలు స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా కలిగి ఉండాలని పెద్దలు, సీనియర్ పాత్రికేయులు హెచ్చరిస్తూనే ఉన్నవిషయం తెలిసిందే. కనుక అమెరికా అయినా ఆంధ్రా అయినా మరణావస్థలో ఉన్న ముద్రణామీడియా రంగంలో పెద్దగా తేడా లేదన్నది ఇక్కడ సారాంశం.

సోమవారం నాలుగు తెలుగు దినపత్రికలు ప్రచురించిన మొదటి పుట వార్తలు గమనించినపుడు ఈ విషయం మనకు సులభంగా అవగతమౌతుంది…

ఈనాడులో  కరుణ ఆరోగ్యంపై ఆందోళన, కాపులు మీకెందుకు ఓట్లేయాలి, ఉద్యోగ వంచవ, మా పోరాటాన్ని ఆపేదిలేదు. వంటి వార్తలు మొదటి పుటలో ఉన్నాయి.  సాక్షి పత్రికలో పరిస్థితి విషమం అంటూ కరణ వార్త, బయో భయం, జగన్ వ్యాఖ్యల వక్రీకరణ వంటి వార్తలున్నాయి. ఆంధ్రజ్యోతిలో మరింత విషమం అంటూ కరణానిధి ఆరోగ్య సమాచారం, కమలానికి దళిత చిచ్చు, జగన్ యూ టర్న్, ప్రైవేట్ హవా అనే వార్తలు ఇచ్చారు. ఇక నమస్తే తెలంగాణ పత్రికలో కరుణ ఆరోగ్యం విషమం అంటూ కరుణ అనారోగ్య వార్త ఇచ్చారు. అది కాకుండా పల్లెల ప్రగతి, బోనమెత్తిన లస్కర్ వంటి వార్తలున్నాయి.

ఇపుడు చెప్పండి… మంచో చెడో అమెరికా అధ్యక్షుడు అన్న మాటలు వాస్తవమే అన్నది మీకూ అనిపించడం లేదూ… ఏపీ కి ప్రత్యేక హోదా కానీ, కడప ఉక్కు, విశాఖ జోన్, జగన్ వాఖ్యలు , చంద్రబాబు ప్రసంగం చివరకు లోక్ సభలో అవిశ్వాస తీర్మాణం… వార్తలు-  విషయం ఏదైనా తెలుగు పత్రికలు స్వంత లాభం కొంత మానుకుని వాస్తవాలను రాసిన సందర్భం ఉందా…?

 

మామాట : దేశాల ఎల్లలు దాటి పతనమౌతున్న విలువలు.

Leave a Reply