కృష్ణాలో యువకుల దారుణం: భార్యాభర్తల బెడ్‌రూమ్ వీడియో…

Share Icons:

విజయవాడ: టెక్నాలజీ పెరిగేకొద్ది యువత పెడదారి పట్టడం ఎక్కువైపోయింది. టెక్నాలజీని ఉపయోగించి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఇద్దరు యువకులు భార్యాభర్తలు బెడ్ రూమ్ ‌లో ఉన్న వీడియోని తీసి, వారిని బ్లాక్ మెయిల్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన భార్యాభర్తలు పడకగదిలోని వ్యక్తిగత దృశ్యాలను అట్లూరి రఘు, షేక్‌ అన్వర్‌ అనే యువకులు రహస్యంగా చిత్రీకరించారు. తర్వాత వాటిని ఆ దంపతులకు చూపించి తమ మాట వినకపోతే బయటపెడతామని బెదిరించారు. వీటితో వారిని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారు. అలాగే పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం ప్రారంభించారు.

ఇక ఆ యువకులు చేస్తున్న బెదిరింపులకు విసిగిపోయిన భార్యాభర్తలు చివరకు పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి గుడివాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పుకున్నారు. బాధితులు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబును ఆశ్రయించారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

భార్యాభర్తలు వ్యక్తిగత వీడియోలు తీసి బెదిరించిన అట్లూరి రఘు, షేక్‌ అన్వర్‌ ఆ ప్రాంతానికి చెందిన వారేనని తెలుస్తోంది. వీరు మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దురాగతాలకు పాల్పడుతారని సమాచారం. వ్యక్తిగత వీడియోలను రహస్యంగా చిత్రీకరించి వాటితో వేధింపులకు పాల్పడుతారని, బ్లాక్‌మెయిల్‌కు దిగి డబ్బు గుంజుతారని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల వారు భగ్గుమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

Leave a Reply