నోట్ల రద్దుకు రెండేళ్లు

Share Icons:

కొన్ని గాయాలు శరీరానికి తగిలితే, మందు రాసి, కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయ్, నొప్పి, బాధా వుండదు. మరి కొంత కాలం గడిచిందా.. కాలమే ఆ గాయల గుర్తులను కూడా మాన్పిపోతుంది. ఇది ప్రకృతి సహజంగా జరిగేది. మరి, రెండు సంవత్సరాల క్రితం భారత ప్రజలకు తగిలిన గాయం ఇంకా మానలేదు. ఇప్పట్లో మానేలా కూడా లేదు. ఇప్పటికీ చాలా బ్యాంకుల ఏటీఎం లు  సెక్యూరిటీ గార్డు కూడా లేకుండా.. అవుటాఫ్ సర్వీస్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.

[pinpoll id=”64853″]

ఒక నిర్ణయం, ఒకే ఒక అనాలోచిత నిర్ణయం ద్వారా భారత ప్రధాని నరేంద్రమోదీ భారతీయ బ్యాంకింగ్ రంగం పరువు గంగలో కలిపారు. రిజర్వు బ్యాంకు ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేకుండా చేశారు.

సామాన్యుడు నగదు కోసం నానాతిప్పలు పడే కొత్త జీవన విధానాన్ని, బ్యాంకులను అసలు నమ్మలేని పరిస్థితిని కల్పించారు. పేద వారి నుంచి బడా బాబుల వరకూ ఆర్థికంగా కుదేలయ్యే కొత్త ఫార్ములాను ప్రయోగించారు. పెద్ద నోట్ల ర్దదు పేరుతో ప్రజల నోట్లో మన్ను కొట్టారు.

ఇంత చేసీ, భాజాపా సర్కారు వారు సాధించిందేమిటి? బయట విచ్చల విడిగా తిరుగుతున్న నల్లధనం అరికట్టబడిందా? మావోలు, సంఘవ్యతిరేకులు కుదేలయ్యారా? పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు తోక ముడిచారా? నల్లబజారు వీరులు బొరియల్లో దాక్కున్నారా….? డీమానిటైజేషన్ ద్వారా మోదీ సర్కారు సాధించిన ఫలితం ఏమిటో ఇప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రికే తెలియడం లేదు. అందుకే ఎవరో అన్నట్టు నోట్ల రద్దు వార్షికోత్సవాలు కూడా జరగలేదు, వాటినీ రద్దుచేశారు.

పెద్ద నోట్లు రద్దు చేస్తానని, మరింత పెద్దదైన రూ. 2 వేల నోటును ఛలామణీలోకితెచ్చిన మోదీ సర్కార్ తెలివితేటలకు ఆర్థిక రంగ నిపుణులు ఇప్పటికీ ముక్కునవేలేసుకునే ఉన్నారు.  నోట్ల రద్దు పై మోదీ గ్యాంగ్ చెబుతున్నదానికీ, రిజర్వు బ్యాంక్ వెలువరించే నివేదికలకు హస్తిమసకాంతరమంత అంతరం ఉంది.

తాముచేసిన ఘనకార్యం ఫలితం ఏమిటో కూడా చెప్పుకోలేని నిరుపయోగమైన పని ద్వారా మోదీ సామాన్య భారతీయుల ఉసురుపోసుకున్నారే గానీ దేశానికి చేసిన మేలు ఏమీ లేదు. మీ రేమంటారు.. అవునంటారా, కాదంటారా, ఏమంటారు?

మామాట: నేలవిడిచి సాముచేయడం అంటే ఏమిటో చూపెట్టారుగా మోడీ గారడీ

Leave a Reply