ఇద్లరు లష్కరే తీవ్రవాదుల హతం

Share Icons:

జమ్ము, సెప్టెంబర్ 11,

ఉత్తర కాశ్మీర్ హండ్వారాప్రాంతంలో మంగళవారం సైనిక దళాల కాల్పుల్లో ఇద్దరు లష్కర్ తోయిబా తీవ్రవాదులు హతమయ్యారు. నిజానికి సోమవారం రాత్రి హండ్వారా ప్రాంతంలో సెక్యూరిటీ దళాలు తనిఖీలు నిర్వహించాయి ఈ సందర్బంగా గలూరా ప్రాంతంలో తలదాచుకుంటున్న తీవ్రవాదులకు- సెక్యూరిటీ దళాలుకు కాల్పులు జరిగాయి. కాల్పులు ఈ ఉదయం వరకూ చోటుచేసుకున్నాయి, ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మరణించినట్టు అధికారులు తెలిపారు.  కాగా సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండుసామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు సైనిక అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ కారణంగా హండ్వారా ప్రాంతంలో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను నిలిపివేశారు.

మామాట : కాల్పులు జరుపుకోవడం సరదాగా ఉందా ఏమో.

Leave a Reply