రెండు కోట్లమంది నన్ను అనుసరిస్తున్నారు

Share Icons:

విజయవాడ, జనవరి 7,

రెండేళ్లుగా ప్రజా శాంతి పార్టి భారతదేశాన్ని ఏ విధంగా రక్షించాలని ప్రణాళికలు తయారు చేస్తుంది. దేవెగౌడ, కపిల్ సిబాల్ పర్యవేక్షణలో సమావేశాలు పెట్టాం. చరిత్ర లో ఎప్పుడూ లేని విధంగా పెద్ద నోట్ల రద్దు ముసుగులో భారీ అవినీతి జరిగిందని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ. పాల్ విమర్శించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. ఎపి లో  ప్రజా శాంతి పార్టి పోటీచేసేందుకు మూడు ప్రధాన కారణాలు వున్నాయి. సేవ్ సెక్యూలర్ ఇండియా,  మోడి హామీలను విస్మరించారు, చంద్రబాబు పూర్తి గా వైఫల్యం చెందారని అయన అన్నారు. ఈ మూడు కారణాలవల్ల మేము దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ప్రపంచంలో ఎంతో మంది తెలుగువాళ్లు రాణిస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. అందులో పాల్ కూడా ఉదాహరణ.

రెండు కోట్ల మంది నన్ను అనుసరిస్తున్నారని అయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి. దేశంలో అన్ని మతాల వారు భయం గా బతుకుతున్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కమ్యూనల్  గా మార్చేందుకు ప్రజా శాంతి పార్టీ సీరియస్ గా రాజకీయాల్లో కి వస్తుంది. దేశంలో క్రైస్తవులు, ముస్లింలు అనేక మంది నాకు మద్దతు పలుకుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ఎన్ని చేశారని అయన ప్రశ్నించారు. ఎపి లో నేను సేవ చేయని గ్రామం లేదు.. ప్రకృతి వైపరీత్యాలు వస్తే కోట్ల రూపాయలు ఇచ్చాను. కేసీఆర్, చంద్రబాబు, వైయస్సార్ లు నా గురించి ఎంత గొప్పగా చెప్పారో యూట్యూబ్ లో చూడండి. ప్రజా శాంతి పార్టిని గెలిపిస్తే  ఆయా నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయల విరాళం ఇస్తాను.

పాల్ ఆర్మీ సభ్యులంతా  గ్రామాలకు వెళ్లి ఒక్కొక్కరు వంద మందిని మా పార్టిలో చేర్పిస్తే తాయిలాలు అందిస్తాం. వెయ్యి మందిని చేర్పిస్తే  మనిషికి మూడు వేల చొప్పున ఇస్తామని అయన చెప్పుకోచ్చారు. మేము అధికారంలోకి రావడం ఖాయం, వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలను పూర్తి గా రద్దు చేస్తాం. నిరుద్యోగులు లేకుండా అందరికీ ఉపాధి కల్పిస్తాం. ఇరవై రోజుల్లో ప్రజా శాంతి పార్టీ ప్రభంజనం ఏమిటో చూస్తారు. అన్ని జిల్లాల్లో పర్యటనలు చేపట్టి చేరికలను ఆహ్వానిస్తాం. గ్రామగ్రామాన పర్యటనలు చేస్తూ ప్రజా శాంతి పార్టీలో చేర్పించేలా కో ఆర్డినేటర్లు పని చేస్తారని అన్నారు. ఫిబ్రవరి వరకు సమావేశాలు పెట్టి, మార్చి లో అభ్యర్దుల జాబితా ను ప్రకటిస్తాం. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు.  ఎవరైనా వస్తే ఐదో, పది సీట్లు కేటాయిస్తామని అయన స్పష్టం చేసారు.

మా అన్నయ్య డేవిడ్ హత్య వెనుక మా వదిన పాత్ర ఉంది. ఒక రాజకీయ కుటుంబం వెనకుండి ఈ హత్య కు పధక రచన చేసిందని అయన ఆరోపించారు. ఆ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదని కోర్టుకే పోలీసులు నివేదిక ఇచ్చారు. నన్ను కూడా హత్య చేసేందుకు కుట్రలు చేశారు. ప్రాణ హాని ఉందని పోలీసు అధికారులను కలిశాను. రక్షణ కల్పించకపోతే నాకేమైనా జరిగితే సిఎం హోదాలోచంద్రబాబు దే బాధ్యత. చంద్రబాబు  అంటే నాకు గౌరవమే. కానీ ఆయన పాలనలో విఫలమయ్యారు. అందుకే నేను ప్రజా శాంతి పార్టీ తో ప్రజల్లోకి వస్తున్నా అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

మామాట: మాయ,భ్రమ, వెర్రి, అమాయకత్వం ఏదైనా కావచ్చు…

Leave a Reply