భారత్ మార్కెట్లోకి దూసుకొచ్చిన డుకాటీ కొత్త బైక్…

Share Icons:

న్యూఢిల్లీ, 17 జూన్:

ఇటలీ సూపర్ బైకుల తయారీ సంస్థ డుకాటీ.. భారత మార్కెట్లోకి సరికొత్త హైపర్‌మోటార్డ్ 950 మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించారు.

937 సీసీ సామర్థ్యం గల ఇంజిన్ కలిగిన ఈ బైక్‌లో రెండు ఇంజిన్లు ఉన్నాయి. దీంతో నూతన డ్రైవింగ్ అనుభవం కావాలనుకునే యువతియువకులకు ఈ బైక్‌ సరైన ఎంపిక అని డుకాటీ ఇండియా ఎండీ శెర్గి కెనోవాస్ తెలిపారు. థ్రిల్లింగ్ అనుభూతిని సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం పూర్తిగా స్పోర్టీగా, ఫియర్ లెస్ క్యారక్టరిస్టిక్స్ ఉన్న మోడల్ బైక్ ఇదన్నారు.

రైడర్లను దృష్టిలో పెట్టుకొని ఈ బైక్‌ను ఆధునీకరించి విడుదల చేశామని ఆయన చెప్పారు.  హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నైలోని షోరూంలలో ఈ బైక్‌ కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని డుకాటీ ఇండియా ఎండీ శెర్గి కెనోవాస్ సూచించారు.

 

Leave a Reply