మై హోమ్ రామేశ్వరావుపై సంచలన ఆరోపణలు చేసిన టీవీ9 రవిప్రకాశ్

Share Icons:

అమరావతి, 22 మే:

టీవీ9 సీఈవోగా తొలగింపు, ఫోర్జరీ కేసుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రవి ప్రకాశ్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో మై హోం రామేశ్వరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ వీడియోలో రవిప్రకాష్ మాట్లాడుతూ.. టీవీ9లో ఏం జరుగుతోంది. రవిప్రకాష్ పరిస్థతి ఏంటి? అన్న మెసేజ్‌లు తనకు రోజూ వస్తున్నాయని,  అందుకే ఈ వీడియో విడుదల చేస్తున్నానని చెప్పారు.

టీవీ9ను 15 ఏళ్ల క్రితం ప్రారంభించానని, తనకు బయటి నుంచి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్‌గా శ్రీని రాజు వచ్చి మద్దతిచ్చారని, ఆర్థికంగా సహాయం చేశారని చెప్పారు. ఇక  ఈ సంస్థ లాభాల్లో నడిచిందని, దేశంలో నెంబర్ 1 న్యూస్ టెలివిజన్‌గా నడిచిందని అన్నారు. అయితే తర్వాత శ్రీని రాజు లాభాలతో బయటకు వెళ్తా అంటే సరే అన్నానని,  ఒక్క రూపాయి లాభం ఆశించకుండా సంస్థను ముందుకు నడపాలని ఆశించానని చెప్పారు.

ఇక మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ తనని కలిసి నలుగురు స్నేహితులం కలిసి తలో 20 శాతం తీసుకొని టీవీ9లో పెట్టుబడులు పెడతాం అన్నారని చెప్పారు. సరే అని శ్రీని రాజును కలిపించానని, అయితే, తాను ఆశించింది ఒకటి.. జరిగింది ఒకటి..’ అని తెలిపారు. అందులో మెజారిటీ వాటాదారుడిగా మైం హోం రామేశ్వరరావు వచ్చి చేరారని చెప్పారు.

తర్వాత రామేశ్వరావు తన దగ్గర ఒక జీతగాడిలా, పాలేరులా పనిచేయాల్సి ఉంటుందని అన్నారని, తాను ప్రతిఘటిస్తే.. టీవీ9 నుంచి బయటికి పంపేలా చేస్తానని అన్నారని రవి ప్రకాశ్ చెప్పుకొచ్చారు.

ఆయన అన్నట్లుగానే తన మీద మూడు దొంగ కేసులు పెట్టారని, అటు పోలీసులు కూడా.. ఎయిర్ పోర్టులో, షిప్ యార్డుల్లో అలర్టు పెట్టామని, ఇతర పరిస్థితుల్లో ప్రయాణించకుండా చూస్తున్నాం అని ప్రకటనలు ఇస్తున్నారని చెప్పారు.

ఇక, మైం హోం రామేశ్వరరావు ఆదేశాలను పోలీసులు తూ.చా. తప్పకుండా పాటిస్తారని, రవిప్రకాష్ ఇంటి మీద దాడిచేయండి, అక్కడున్న మహిళలను ఇబ్బందులకు గురి చేయండి లాంటి ఆదేశాలను హైదరాబాద్ పోలీసులు పాటిస్తారని  రవిప్రకాష్ వీడియోలో ఆరోపించారు.

మామాట: వీడియోలు తర్వాత ముందు పోలీసులకి లొంగిపోతే మంచిదేమోగా

Leave a Reply