పోలీసులకి చిక్కకుండా టెక్నాలజీని వాడుతున్న టీవీ9 రవి ప్రకాశ్….

Share Icons:

హైదరాబాద్, 21 మే:

డేటా చోరీ, ఫోర్జరీ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సి‌ఈ‌ఓ రవిప్రకాశ్, పోలీసుల చిక్కకుండ టెక్నాలజీని వాడుతూ… తప్పించుకుని తిరుగుతున్నారు. రోజుకు రెండు మూడు సిమ్ కార్డులు చొప్పున 12 రోజుల్లో 30 సిమ్ కార్డులను మార్చినట్టు పోలీసులు గుర్తించారు. టీవీ9 కార్యాలయంలో సోదాలు జరిగిన ఈ నెల 9వ తేదీ నుంచి ఇప్పటివరకు 30 సిమ్‌లు మార్చారని సమాచారం.

తన జాడను బయట పెట్టకుండా ఉండేందుకు వైఫై ద్వారా వాట్స్ యాప్ కాల్స్ లో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారని కూడా గుర్తించినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ సైతం ఇంతవరకూ పోలీసులకు అందుబాటులోకి రాలేదు. దీంతో పోలీసులు వీరిద్దరి కోసం గాలిస్తున్నారు.

ఇదిలా ఉంటే తనపై దాఖలైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ను ఇవ్వాలని రవిప్రకాశ్ హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. తాను పోలీసుల విచారణకు సహకరిస్తానని, అయితే, తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నారు. టీవీ9 వాటాల వివాదం ప్రస్తుతం విచారణలో ఉందని, అది పూర్తి కాకుండా, పోలీసులు కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమన్నది రవిప్రకాశ్ వాదన.

మామాట: టెక్నాలజీ ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది అనమాట

Leave a Reply