నెల్లూరు సిటీలో నువ్వా..నేనా…!

Share Icons:

నెల్లూరు, 27 మార్చి:

ఈ సారి ఎన్నికల్లో నెల్లూరు సిటీలో హోరాహోరీ పోరు జరగనుంది. అందుకు కారణం మంత్రి నారాయణ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగడమే. నారాయణ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తుండగా…. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌. ఇప్పటికే రెండు అసెంబ్లీ ఎన్నికలను చూసిన అనుభవం ఈయనది. మూడోసారి మళ్లీ తలపడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున అనిల్ కుమార్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 19వేలకు పైగా మెజార్టీతో గెలిచారు. ఈ సారి మాత్రం ఆయనకు గట్టిపోటీ ఉండనుంది. మంత్రి నారాయణ చాలా ముందు నుంచే నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వచ్చారు. అదే ఆయనకు లాభం చేకూర్చే అంశం. పార్టీ అధికారంలో ఉండటంతో.. అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 

ఆర్ధికంగా నారాయణ బలం గురించి చెప్పనక్కర్లేదు. అయితే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం. స్థానిక నాయకులను పట్టించుకోకపోవడం. పార్టీ కేడర్‌తో సన్నిహితంగా ఉండకపోవడం వంటి అంశాలు నారాయణకి మైనస్.

ఇక అనిల్‌కుమార్‌కి వైసీపీ సంప్రదాయ ఓటుబ్యాంకు అండగా ఉండడం. ప్రజల్లో ఫాలోయింగ్ ఉండటం. ఇప్పటికే రెండు సార్లు పోటీ చేసిన అనుభవం ఉండటం ప్లస్ కాగా.. ఈ ఐదేళ్లలో ప్రజలకు ఏమీ చేయకపోవడం. నారాయణ చేపట్టిన అభివృద్ధి పనుల ప్రభావం. బీజేపీతో వైసీపీకి పొత్తుందని ముస్లింలు విశ్వసించడం లాంటి అంశాలు మైనస్ కానున్నాయి. ఇక ఈ నియోజకవర్గంలో బీసీలు, రెడ్లు, బలిజ, ముస్లిం ఓటర్లదే కీలక పాత్ర. గత ఎన్నికల్లో అనిల్‌కుమార్‌కు బీసీలు, రెడ్లు అండగా నిలవడం వల్లే విజయం సాధించగలిగారని అంటుంటారు. మరి చూడాలి ఈసారి నెల్లూరు సిటీ ఎవరికి దక్కుతుందో.

మామాట: ఈసారి అనిల్‌కి నారాయణ గట్టి పోటీ ఇస్తున్నారు..

Leave a Reply