పోటీకి దూరంగా టీటీడీపీ అధ్యక్షుడు….

TTDP president L Ramana fires on motkupalli narasimhulu
Share Icons:

హైదరాబాద్, 6 నవంబర్:

వచ్చే నెల 7న తెలంగాణ శాసనసభకి ఎన్నికలు జరగనున్న సంగతి అందరికీ తెల్సిందే. ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్‌ని ఓడించాలని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. అయితే ఈ మహాకూటమిని ఏర్పాటుచేయడంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ఆయన ప్రకటించారు.

కాగా, మహాకూటమి పొత్తులో భాగంగా ఆయన కోరుట్ల నుండి పోటీ చేస్తారని కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే ఆయన పోటీకి దూరంగా ఉంది….కూటమి అభ్యర్థుల తరఫున రాష్ట్రం మొత్తం ప్రచారం చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఆయన సొంత నియోజకవర్గం జగిత్యాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి అండగా నిలిచారు. మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని రమణ తెలిపారు.

ఇక 1994లో తొలిసారిగా జగిత్యాల నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి గెలిచిన రమణ.. అక్కడి నుంచి ఐదుసార్లు పోటీచేశారు.

మామాట: కూటమి కోసం సీటు త్యాగం చేశారా……

Leave a Reply