అప్పుడు మోత్కుపల్లిని పిలిస్తే రాలేదు..

TTDP president L Ramana fires on motkupalli narasimhulu
Share Icons:

హైదరాబాద్, 15 జూన్:

తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవకూడదని తిరుపతి వెళ్ళి మొక్కుకుంటానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ కూడా తాను మద్ధతిస్తానని కూడా ప్రకటించారు.

ఇక టీడీపీకి వైరి పక్షాల నేతలతో ఆయన వరుసగా భేటీ అవుతుండటంతో ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

వారి మద్ధతుతో ఏపీలో పర్యటిస్తానని ప్రకటించి తెలుగుదేశం నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేశారు.

అయితే మోత్కుపల్లి ఇలా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో టీ. టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు.

ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..ఎన్నో అవకాశాలు ఇచ్చి ఆదరించిన తల్లిలాంటి పార్టీకి మోత్కుపల్లి ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు.

‘పెడితే పెళ్లికి లేకపోతే చావుకు’ అన్నట్టు మోత్కుపల్లి వ్యవహరిస్తున్నారని, టీడీపీ వ్యక్తులను చూసి భయపడే పార్టీ కాదని చెప్పారు. అయితే మోత్కుపల్లిని  ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి పిలిస్తే రాలేదని, అప్పటి నుంచి ఏ కార్యక్రమాలకు పిలవలేదని రమణ చెప్పారు.

మామాట: టీడీపీ అధిష్టానంకి చుక్కలు చూపిస్తున్న మోత్కుపల్లి…

Leave a Reply