ఎక్కువ సీట్లు వద్దు..సర్దుకుపోండి…టీటీడీపీ నేతలతో చంద్రబాబు

Share Icons:

అమరావతి, 8 నవంబర్:

తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా, సీట్ల సంఖ్యపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో టీటీడీపీ నేతలు గురువారం అమరావతిలోని సీఎం నివాసంలో 
సమావేశమయ్యారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి,   రేవూరి ప్రకాష్ రెడ్డితో చంద్రబాబునాయుడు 30 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించారు.  

ఈ సందర్భంగా అసంతృప్తులతో స్వయంగా మాట్లాడుతానని చంద్రబాబు ఎల్. రమణకు హామీ ఇచ్చారు. మోదీని ఎదుర్కొనేందుకు తెలంగాణ ఎన్నికలు కలిసివస్తాయని నేతలకు బాబు చెప్పారు.

కాగా, మరో 1-2 రోజుల్లో తుది జాబితా, అభ్యర్థుల పేర్లపై స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. ప్రజాకూటమిలో 14 కంటే ఎక్కువ సీట్లను కోరితే ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టీడీపీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పోటీ చేయడం ముఖ్యం కాదనీ, కూటమి అధికారంలోకి వచ్చే విషయమై ప్రాధాన్యత ఇవ్వాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

అయితే తెలంగాణలో అభ్యర్థుల జాబితా ప్రకటించే విషయంలో టీడీపీ నేతలతో చర్చించేందుకు వీలుగా బెంగుళూరుకు తనతో పాటు రావాలని చంద్రబాబు ఎల్.రమణ, రావులను కోరారు. ఈ మేరకు వీరిద్దరూ కూడ బాబుతో పాటు బెంగుళూరుకు వెళ్లనున్నారు.

మామాట: ఇంతగా ఎందుకు సర్దుకుపోతున్నట్లో…

Leave a Reply