కేసీఆర్ నిర్ణయం.. భస్మాసుర హస్తమే…

TTDP leader fires on kcr
Share Icons:

అమరావతి, సెప్టెంబర్ 6:

ప్రజలు ఐదు ఏళ్ళు పాలించమని పట్టం కడితే, తన స్వార్థం కోసం కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసుకున్నారని టీటీడీపీ నేత పెద్దిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్..ప్రజలకు అసెంబ్లీ రద్దు పైన సమాధానం చెప్పాలని, మెజార్టీ పూర్తిగా ఉన్న కేసీఆర్ తొమ్మిది నెలల పరిపాలన కాలం ఎందుకు వదులుకున్నారని నిలదీశారు.

ఇంటి పొరుతోనా లేక జ్యోతిషుల సూచనతోనా అని ప్రశ్నించారు. పథకం ప్రకారమే కేసీఆర్ ..అసెంబ్లీ రద్దు చేసుకున్నారని, కేసీఆర్ నిర్ణయాన్ని ప్రజలే ప్రశ్నిస్తారని అన్నారు. అయితే కేసీఆర్ తన పాలనలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆరోపించారు.

ఇక 8వ తేదీన చంద్రబాబు హైదరాబాద్ వస్తున్నారని,  అప్పుడు తెలంగాణ టీడీపీ సమావేశం జరుగుతుందని, భవిష్యత్ కార్యాచరణ పైన టీ టీడీపీ నేతలకు ఆయన దశదిశ చేస్తారని చెప్పారు. అసలు టీడీపీకి ఎన్నికల కొత్తకాదని, పొత్తులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్నారు. అయితే సీపీఐ నేతలు తమతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నారని, కాంగ్రెస్ నేతలు కూడా పత్రికల ద్వారా మాతో పొత్తుకు ఆసక్తి చూపారని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పొత్తుకు  సిద్దమంటోందని, కోదండరామ్, లెఫ్ట్ పార్టీలు ఐక్య కూటమితో వెళ్దామనే ప్రతిపాదనలు పెట్టారని వెల్లడించారు. చంద్రబాబుతో చర్చించాక.. అన్ని రకాలుగా ఆలోచించి పొత్తులపై నిర్ణయం వుంటుందని ఆయన అన్నారు.

అసలు కేసీఆర్ నిర్ణయం.. భస్మాసుర హస్తమేనని, ఎన్నికలు ఇప్పుడే వస్తాయా..? అనే అనుమానమూ కూడా ఉందని, గతంలో తాము చేసిన ముందస్తు ప్రయత్నాలు వికటించాయని, ఇప్పుడు కేసీఆరుకు అలాంటి పరిస్థితే ఎదురవుతుందని ఆయన అన్నారు.

మామాట: మరి చూడాలి ఎవరికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో?

Leave a Reply