పోటుని మూసి పస్తులుంచారు….

Share Icons:

తిరుపతి, మే 21:

తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడి) ఈ మధ్య చాలా ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఆరోపణలు చేసింది, చేస్తున్నది ఎవరో కాదు, స్వామి వారి ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు.

టీటీడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. స్వామి వారి ఆభరణాలు, నగలపై ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు, ఇప్పుడు స్వామి వారి పోటును మూసేసిన సందర్భం గురించి మాట్లాడారు.

ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన 65 సంవత్సరాల నిబంధనలో భాగంగా శ్రీవారి ప్రధాన అర్చకుడి బాధ్యతల రమణ దీక్షితులును తప్పించారు. టీటీడి పని తీరును తప్పుబడుతున్న రమణ దీక్షితులు, ఒక్కో సారి ఒక్కో అంశంతో టీటీడిపై నిరంతర ఆరోపణలు చేస్తున్నారు.

స్వామివారికి నైవేద్యంగా పెట్టె అతి పవిత్రమైన తీర్థప్రసాదాలను తయారు చేసే పోటుని మూసేసి స్వామి వారిని పస్తులు ఉంచడం భావ్యం కాదని రమణ దీక్షితులు పేర్కొన్నారు.

టీటీడిలోని మొదటి ప్రాకారంలో తయారు చేసే తీర్ధప్రసాదాలు మాత్రమే పెట్టాలి అని,  క్రీస్తు శకం 1150 లో ఈ పోటుని విమాన ఆకారంలో నిర్మించారని, ఇప్పటి వరకు ఆ పోటుని మూసి వేసిన సమయం లేదని అని ఆయన పేర్కొన్నారు.

మొదటి ప్రాకారంలో ఉన్నటువంటి పోటుని మూసేసి, రెండవ  ప్రాకారంలో ఉన్నటువంటి పోటులో నైవేద్యాలు తయారు చేయవలసిన అవసరం ఏముంది అని ఆయన ప్రశ్నించారు.

మొదటి ప్రాకారంలో మరమ్మత్తులు జరుగుతున్నాయి  అని, అందుకోసమే 21 రోజుల పాటు పోటుని మూసి వేయాల్సి వచ్చిందని టీటీడి సమాధానం చెప్పింది.

ఒక చిన్న మరమ్మత్తు కోసం మొత్తం పోటునే మూసి వేయాల్సిన అవసరం లేదని, అదే పోటులో స్వామి వారికి నైవేద్యం తయారు చెయ్యవచ్చునని రమణ దీక్షితులు పేర్కొన్నారు.

21 రోజుల పాటు పోటుని మూసేసి, స్వామి వారికి కలుషిత ప్రధాన నైవేద్యం పెట్టారని, అది స్వామి వారు స్వీకరించకుండా, పస్తులు ఉంచారని దీక్షితులు వాపోయారు.

శ్రీవారి నైవేద్యం కేవలం తయారి దారుడు, ప్రధాన అర్చకుడు తప్ప మరెవ్వరు తాకడానికి వీలు లేదని, అలక చేస్తే అపవిత్రం అయ్యి స్వామి వారు దానిని స్వీకరించరని ఆయన తెలియజేసారు. స్వామి వారిని 21 రోజుల పాటు పస్తులు ఉంచడం సరి కాదని, అల చేస్తే అరిష్టం అని పేర్కొన్నారు.

ఉద్దేశ్యపూర్వకంగా అపచారాలు చేస్తే, స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారని రమణ దీక్షితులు అంటున్నారు.

మామాట: ఇంకెన్ని ఆరోపణలు/నిజాలు బయట పడతాయో?

Leave a Reply