పట్టువిడవని దీక్షితులు…

Share Icons:

న్యూ ఢిల్లీ, మే 22:

తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) లో అర్చకుల పై విధించిన 65 వయోపరిమితి కారణంగా టీటీడీ ప్రధాన అర్చకుడి స్థానం నుండి తప్పు కున్న రమణ దీక్షితులు వరుస ఆరోపణలతో టీటీడీ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు.

ఇందులో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీటీడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ను ఢిల్లీ లో కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అసలు దీక్షితులు నిజంగానే అమిత్ షాను కలిశాడా ? ఎందుకు కలిసాడు? అన్న ప్రశ్నలు టీటీడీ పాలక మండలిని ఆందోళనలకు గురిచేశాయి.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇటీవల భేటీ అయినట్టు కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి.

ఇక విషయానికొస్తే టీటీడీలో పాలకమండలి తీరు మార్చుకోవాలని, పోటుని మూయడం లాంటి పనులు మానుకోవాలని, స్వామివారి ఆభరణాలను దేశం దాటిస్తున్నారని చర్చించినట్లు సమాచారం. ఇక టీటీడీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలపై బీజేపీ అధ్యక్షుడితో చర్చించారు.

సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ రమణ దీక్షితులు బీజేపీని కోరినట్టు సమాచారం. ఇక గులాబీ రంగు వజ్రం గురించి టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ నిజాలను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉండగా బీజేపీకి, వైసీపీ కి రమణ దీక్షితులు బంధువర్గమని టీడీపీ నేతలు రాజకీయ విమర్శలకు దిగారు.

మామాట : టీటీడీపై సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తుందా?

Leave a Reply