తెలంగాణ బంద్: తెగిపడిన సీపీఐఎంఎల్ నేత బొటనవేలు

TSRTC Employees Observe Bandh in Telangana After Two Weeks of Strikes, Opposition Backs It
Share Icons:

హైదరాబాద్: తమ డిమాండ్లని నెరవేర్చాలని రెండు వారాలుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈరోజు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్ కు ప్రజాసంఘాలు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ. సీపీఐ, తదితర పార్టీలు మద్ధతు తెలిపాయి. అయితే బంద్ చేస్తున్న నాయకులని ఎక్కడకక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నిరసనకు దిగిన సీపీఐఎంఎల్ నేత రంగారావును అరెస్ట్ చేసి పోలీస్ వ్యానులోకి ఎక్కించారు. ఈ క్రమంలో.. తన వేలును తలుపుల మధ్య పెట్టి గట్టిగా నొక్కేశారని రంగారావు ఆరోపిస్తున్నారు. పోలీసుల చర్యకు ఆయన బొటనవేలు తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది.

Telangana Bandh : పోలీసుల అత్యుత్సాహం.. తెగిన సీపీఐఎంఎల్ నేత బొటనవేలు

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రంగారావు.. కేసీఆర్ తనను చంపమన్నారా? అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు.. ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడినందుకు ఇదేనా తనకిచ్చిన బహుమానమా? అని ప్రశ్నించారు. రంగారావు బొటనవేలు తెగిపోవడంతో వామపక్ష నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే, తెలంగాణవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. చాలాచోట్ల డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. దీంతో బస్టాండ్స్ నిర్మానుష్యంగా మారిపోయాయి.

శనివారం తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ సంపూర్ణంగా జరిగిందని ఆర్టీసీ జేఏసీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. బంద్‌కు మద్దతునిచ్చిన,సహకరించిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్నవారిని అరెస్ట్ చేయడం అక్రమమని.. ఆ అరెస్టులను ఖండిస్తామని వెల్లడించింది.అరెస్టులు చేసే క్రమంలో.. భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని పేర్కొంది. అరెస్ట్ చేసినవారందరినీ బేషరతుగా విడుదల చేయాలని,సాయంత్రానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించింది.

ఇదిలా ఉంటే, ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్‌కు మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చార్మినార్‌లో మెరుపు ర్యాలీ చేపట్టారు. రాజీవ్ సద్భావన యాత్ర అనంతరం కార్మికులకు సంఘీభావంగా ర్యాలీగా బయలుదేరారు. స్థానిక దుకాణాలను మూసివేయించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు.. నేతలను అరెస్ట్ చేసి బహదూర్‌పుర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

Leave a Reply