టీచర్లకి గన్‌తో పాటు బోనస్ కూడా….

Share Icons:

వాషింగ్టన్, 24 ఫిబ్రవరి:

ఇటీవల కాలంలో అమెరికాలో  పాఠశాలలపై కొందరు దుండగులు తుపాకీలతో కాల్పులు జరిపే ఘటనలు అధికమైపోయాయి.

ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిని అడ్డుకోవడానికి ఓ ఐడియా తెరపైకి తెచ్చారు.

అదేంటంటే అక్కడి స్కూల్ టీచర్లకు తుపాకులిచ్చి, అలాంటి ఘటనలు జరిగినపుడు దుండగులని కాల్చివేయాలనే ఆలోచనని చేస్తున్నారు.

దాని ప్రకారమే త్వరలోనే ఆ ఆలోచన కార్యరూపం దాల్చబోతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది టీచర్లకు ఆయుధాలు అందించి, వారికి తగు శిక్షణ ఇవ్వనుందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమీకరించే అవకాశముందని ఆ వర్గాలు వెల్లడించాయి.

అదేవిధంగా తుపాకులను కలిగి ఉన్న టీచర్లకు 1,032 డాలర్లు(రూ.67 వేల) చొప్పున బోనస్ ఇస్తే మొత్తం పది లక్షల మందికి రూ.6700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నాయి.

ఇక  దీనికి సంబంధించి శాసన-బడ్జెట్ సంబంధిత ప్రతిపాదనపై కాంగ్రెస్ సభ్యులతో ట్రంప్ త్వరలోనే మాట్లాడుతారని తెలిపాయి.

మామాట: ఉపాధ్యాయులే కాల్పులకు తెగబడితే… 

English summary:

President Trump, who said the armed teachers should receive extra pay as an incentive, promoted his idea as demands for stronger gun control intensified across the country.

Leave a Reply