ట్రంప్ బస చేయబోయే హోటల్ రూమ్ రెంట్ ఎంతంటే?

Share Icons:

ఢిల్లీ:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇండియాకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ తన అర్ధాంగి మెలానియాతో కలిసి న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్యా లగ్జరీ హోటల్, 14వ అంతస్తులో ఉన్న చాణక్యా గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ లో బస చేయనున్నారు. ఈ హోటల్ లో ట్రంప్ దాదాపు 24 గంటల పాటు బస చేయనుండగా, ఒక రాత్రికి రూ. 8 లక్షల అద్దె చార్జ్ చేస్తున్నట్టు హోటల్ ప్రకటించింది. ఇది కేవలం చాణక్య గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ కు మాత్రమే.

ఇది కాకుండా, హోటల్ లోని 428 గదులను అమెరికా అధికారులు, ట్రంప్ సిబ్బందికి కేటాయించారు. వీటి అద్దెను కూడా కలిపితే, మొత్తం ఐటీసీకి కోట్లలోనే ముడుతుంది. ఇక ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్ నర్ తదితరులు, మరో సూట్ రూమ్ లో బస చేస్తారు. ట్రంప్ తో పాటు అమెరికా నుంచి వచ్చిన అధికారులు, మీడియా సిబ్బందికి కూడా ఇదే హోటల్ లో గదులు కేటాయించారు.

ఇక ట్రంప్ సేదదీరే గదిని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సిల్క్ ప్యానల్ గోడలు, వుడెన్ ఫ్లోరింగ్, అందమైన కళాకృతులను తీర్చిదిద్దారు. ఈ గదిలో 12 మంది కలిసి కూర్చుని భోజనం చేసే సదుపాయంతో పాటు, రిసెప్షన్ ఏరియా, మినీ జిమ్, ప్రత్యేక స్పా కూడా ఉన్నాయి. ఇక ట్రంప్ కోసం ఆయనకు ఇష్టమైన చెర్రీ వెనీలా ఐస్ క్రీమ్, డైట్ కోక్ తదితరాలను సూట్ లో సిద్ధంగా ఉంచారు. ట్రంప్ దంపతులకు వండి వడ్డించేందుకు ప్రత్యేక చెఫ్ ను అందుబాటులో ఉంచారు.

ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ట్రంప్, నూతనంగా నిర్మించిన మొతేరా స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొననుండగా, 1.10 లక్షల మంది సామర్థ్యంతో ఉన్న స్టేడియానికి దాదాపు 1.50 లక్షల మందిని తరలించాలని (గ్యాలరీ కాకుండా మైదానంలో కూర్చునేవారు కూడా కలిపి) బీజేపీ ముందే నిర్ణయించింది.

ఈ ఉదయం 8 గంటల నుంచే స్టేడియంలోకి ప్రజలను అనుమతించడాన్ని ప్రారంభించారు. లోనికి వచ్చే ప్రతి ఒక్కరినీ మూడంచెల తనిఖీ తరువాతనే గ్యాలరీల్లోకి పంపించారు. ఇక మైదానంలో కూర్చునే వారిని ఐదంచెల్లో తనిఖీలు చేశారు. మోడీ, ట్రంప్ ప్రసంగించే డయాస్ చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లను అమర్చారు. ఇప్పటికే స్టేడియంలో లక్ష మందికి పైగానే ప్రజలు వచ్చి చేరారు. దీంతో ఓక బయటి దేశంలో ట్రంప్ పాల్గొనే కార్యక్రమానికి ఇంత మంది ప్రజలు రావడం ఇదే తొలిసారి కానుంది.

 

Leave a Reply