భారత్, చైనాలకు షాక్ ఇచ్చిన ట్రంప్..

Share Icons:

వాషింగ్టన్, 8 సెప్టెంబర్:

భారత్, చైనాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగల దేశాలకు రాయితీలను నిలిపేయాలని అనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే భారతదేశం, చైనా వంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని కాబట్టి అమెరికా ప్రస్తుతం ఇటువంటి దేశాలకు ఇస్తున్న రాయితీలను నిలిపేయాలని అన్నారు.

శుక్రవారం ఉత్తర డకోటా, ఫార్గో సిటీలో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు.

అసలు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) చాలా చెత్త సంస్థ అని, చైనా మహా ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణం ఈ సంస్థేనని ఆరోపించారు. వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగల దేశాలని కొన్ని ఉన్నాయని, వీటికి అమెరికా రాయితీలు ఇస్తోందని అన్నారు.

భారతదేశం, చైనా వంటి దేశాలు నిజంగా వృద్ధి చెందుతున్నాయని,  ఈ దేశాలు తమను తాము అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకుంటూ, ఆ వర్గీకరణలో రాయితీలు పొందుతున్నాయన్నారు. కాబట్టి మనం వాటికి డబ్బులివ్వడం ఆపేయబోతున్నామని ప్రకటించారు.

మామాట: మీరు అధికారంలోకి  వచ్చాక చాలానే ఆపేసినట్లున్నరుగా…..

Leave a Reply