రేవంత్ బరిలో ఉండటంతో జాగ్రత్త పడుతున్న టీఆర్ఎస్…

trs party tense in the revanth reddy issue
Share Icons:

హైదరాబాద్, 19 మార్చి:

మరి కొద్దీ రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి కాంగ్రెస్‌ పార్టీ తరపున అభ్యర్ధిగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి కసి మీదున్న రేవంత్ ఈ సారి గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.. దీంతో ఆయన కూడా గత రెండు రోజులుగా నియోజక వర్గం పరిధిలోని పలు అసెంబ్లీ పరిధిలోని కీలక నేతలను కలుస్తున్నారు. అంతేకాకుండా గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆయా నియోజక వర్గాల పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అయిహే మల్కాజిగిరి పార్లమెంట్‌ నుంచి టీడీపీ తరపున పోటీచేసేందుకు 2014లోనే రేవంత్‌రెడ్డి ప్రయత్నించి భంగపడ్డారు. ఈసారి మాత్రం కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం యాధృచ్ఛికమే అయినా తన కోరికను ఈ రకంగా ఆయన తీర్చుకుంటు న్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఇక రేవంత్ రాకతో టీఆర్ఎస్ అలెర్ట్ అయింది. రేవంత్‌కి పోటీగా స్ట్రాంగ్ అభ్యర్ధిని బరిలోకి దించాలని చూస్తోంది. ఈ పార్లమెంట్‌కి సీఎమ్మార్‌ విద్యాసంస్థల అధినేత, ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖరరెడ్డి, సీఎం కేసీఆర్‌కు దగ్గర బంధువు నవీన్‌రావు పేర్లు ప్రధానంగా వినిపించాయి. మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో ఏడు నియోజక వర్గాలు ఎల్‌బినగర్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, కంటోన్మెంట్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌ ఉన్నాయి.

ఎల్‌బి నగర్ నుండి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ కూడా కారు ఎక్కనుండటంతో పార్లమెంట్‌ పరిధిలోని అన్నిస్థానాలు వారి ఖాతాలో పడ్డాయి. దీంతో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మళ్ళీ రేవంత్ కి చెక్ పెట్టాలని చూస్తోంది. కానీ రేవంత్ వారికి ధీటుగా అందరినీ కలుపుకుని ముందుకు వెళుతున్నారు. ప్రత్యేకించి పార్లమెంట్‌ పరిధిలోని కొన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్‌ వుంది. దానిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ గెలుపు కోసం కష్టపడుతున్నారు.

మామాట: ఈ సారి రేవంత్‌కి చెక్ పెట్టడం అంత సులువు కాదు అనుకుంటా

Leave a Reply