గులాబీ దళానికి వణుకు పుట్టిస్తున్న రేవంత్

trs party tense in the revanth reddy issue
Share Icons:

కోడంగల్, 10 అక్టోబర్:  

రేవంత్‌రెడ్డి.. గులాబీ పార్టీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. కేసీఆర్ వాగ్దాటితో ఎవ‌రైనా చిత్తు అనే కారు కూత‌ల నేత‌ల‌కు గుబులు రేకెత్తిస్తుంది. కొడంగ‌ల్ సాక్షిగా హ‌రీష్‌రావు ఏదొఒక‌టి చేసి.. రేవంత్‌ను చిత్తు చేద్దామ‌ని చేసిన ప్లాన్‌లు కాస్తా బెడ‌సికొడుతున్న వాతావ‌ర‌ణ క‌నిపిస్తుంది.  త‌త్వం బోధ‌ప‌డిన‌ట్లుగా ఇప్పుడు కేసీఆర్ కోట‌రీ.. మీన‌మేషాలు లెక్కిస్తుంది. నిన్న‌టి వర‌కూ ఎగిరెగిరి ప‌డిన క‌విత‌క్క కూడా ఈ మ‌ధ్య సైలెంట్‌గా మారింది.

ముంద‌స్తు ముచ్చ‌ట  గులాబీబాస్‌ను మూడు చెరువుల నీరు తాగిస్తున్న‌ట్లుగా వాతావ‌ర‌ణం మారిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌మ‌ది బ‌లుపు అని భావించిన పార్టీ శ్రేణులు కూడా.. మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు.. పెల్లుబుకుతున్న ప్ర‌జావ్య‌తిరేక‌త క‌ళ్లెదుట క‌నిపిస్తుంటే బైర్లు క‌మ్మిన క‌ళ్ల‌తో సాయం కోసం దిక్కులు చూస్తున్నారు.

దీనంత‌టికీ కార‌ణం.. రేవంత్‌రెడ్డి. టీడీపీలో ఉన్న‌పుడు ఇంతే చెల‌రేగాడు. అప్పుడూ రేవంత్‌ను దెబ్బ‌తీసేందుకు అనువైన స‌మ‌యం కోసం చూశారు అంతే. ఓటుకు నోటు కేసు మెడ‌కు చుట్టారు. నెల‌రోజులు జైలు నుంచి బ‌య‌టకు వ‌చ్చాక సైలెంట్ అవుతాడ‌నుకుంటే.. మ‌రింత రెచ్చిపోయాడు. పైగా పాపులారిటీ సంపాదించాడు. మందీమార్బ‌లం కూడా పెరిగారు. అస్త‌వ్య‌స్తంగా మారిన హ‌స్తం కేడ‌ర్ కూడా త‌మ పార్టీకు బాహుబ‌లి రేవంత్ అన్న‌ట్టుగా ఆహ్వానించి మ‌రీ ప‌ట్టంక‌ట్టింది. ఉత్త‌మ్‌కుమార్‌, కోమ‌టిరెడ్డి, జానారెడ్డి, రేణుకాచౌద‌రి వంటి సీనియ‌ర్లు ఉన్నా.. నువ్వే ముందుండి న‌డిపించాలంటూ ఊత‌మిచ్చారు.

అంతే.. పార్టీ మారినా.. రేవంత్ దూకుడు త‌గ్గ‌లేదు. దీంతో మ‌రోసారి కేసీఆర్ కోట‌రీ. రేవంత్ పాత‌కేసులు తిర‌గ‌దోడారు. మ‌రోవైపు కొడంగ‌ల్‌లో స్వ‌యంగా హ‌రీష్‌ను రంగంలోకి దింపారు. పార్టీ మారిన వారికి నెత్తిన పెట్టుకుంటామంటూ హామీలు గుప్పించారు. ఈ సారి రేవంత్‌కు డిపాజిట్లు గ‌ల్లంతే అన్న‌ట్లుగా ప్ర‌చారం ఊద‌ర‌గొట్టారు. అయినా త‌గ్గ‌లే. అంతే.. ఈ సారి పాతకేసులతో నోటీసులు, విచార‌ణ‌లు.. ఐటీ, ఈడీ రంగంలోకి దిగాయి.రేవంత్‌ను క‌ట్ట‌డి చేసి జైల్లో పెట్టాల‌నుకున్నా ఎందుకో స‌ర్కారు చివ‌రి నిమిషంలో ఉలికిపాటుకు గురైంది. త‌న‌ను జైలులో పెట్టినా అక్క‌డ నుంచే నామినేష‌న్ వేసి గెలుస్తానంటూ స‌వాల్ విసిరాడు.

దీంతోపాటు.. రెడ్డి వ‌ర్గం అంతా రేవంత్‌వైపు నిల‌బ‌డింది. ఇదంతా.. గులాబీ పార్టీకు మ‌రింత శరాఘాత‌మైంది. అంతే.. స్వ‌యంగా కేసీఆర్ తిట్ల‌దండ‌కం అందుకున్న రేవంత్‌ను ల‌క్ష్యంగా చేసుకుని దుమ్ముదులిపాడు. అయినా.. రేవంత్ ఘాటుగానే స‌మాధాన‌మిస్తున్నాడు. ఇస్తూనే ఉంటానంటున్నాడు. పైగా ఇప్పుడు త‌న రాజ‌కీయ గురువు చంద్ర‌బాబునాయుడు కూడా త‌న‌కు బ‌లం.. బ‌ల‌గంగా మార‌టంతో ఇక త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌నేంత వ‌ర‌కూ చేరాడు. ఇది విశ్వాస‌మా.. అతి విశ్వాస‌మా అనుకునే నేత‌లు సైతం.. కేసీఆర్‌కు స‌రైన మొగుడు దొరికిడాడంటూ తెగ మెచ్చుకునేంత చేరిన రేవంత్ నిజంగానే.. కొడంగ‌ల్ సింహ‌మేనంటున్నారు రేవంత్ అభిమానులు.

మామాట: గులాబీ నేతలే రేవంత్‌ ఫాలోయింగ్ పెంచుతున్నట్లున్నారు…

Leave a Reply