ఉత్తమ్.. మూర్ఖత్వంతో మాట్లాడకు: కర్నె ప్రభాకర్

TRS MLC Karne Prabhakar comments against Congress
Share Icons:

హైదరాబాద్, 8 మే:

ప్రభుత్వం చేసే అన్నీ పనులని విమర్శించడమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.

ఈరోజు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టులపై ఉత్తమ్‌తో పాటు మిగిలిన కాంగ్రెస్ నాయకులు అజ్ఞానం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.

ప్రాజెక్ట్‌లు వేగంగా పూర్తవుతుండడంతో కాంగ్రెస్‌ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన మండిపడ్డారు.

అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను టూరిజం స్పాట్‌గా మార్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హేళనగా మాట్లాడటం సరికాదన్నారు.

ఇక్కడి సాగునీటి రంగంపై అవగాహన పెంచుకున్న తర్వాత జీవన్ రెడ్డి మాట్లాడితే బాగుండేదని ఆయన అన్నారు.

ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు రైతు ఆత్మహత్యలు తగ్గేవని కర్నే పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమం అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, పాస్‌పుస్తకాలపై ఉత్తమ్ ఆరోపణల్లో పస లేదని ఎమ్మెల్సీ కర్నె తెలిపారు.

అలాగే ఓటుకు నోటు కేసు విషయం గురించి ప్రభాకర్ మాట్లాడుతూ…. ఈ కేసుతో పాటు పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను సమీక్షించే అధికారం ముఖ్యమంత్రికి ఉందని చెప్పారు. ఎన్నికలకు, కేసులకు సంబంధం లేదని చెప్పారు.

మామాట:  సాగునీరు ఉంటే, రైతే రాజు అందులో అనుమానం ఎందకు? 

Leave a Reply