ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు…

former mla somarapu satyanarayana resigns trs party
Share Icons:

హైదరాబాద్: గత పది రోజులుగా తమ డిమాండ్లని నెరవేర్చాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సమ్మెపై వెనక్కి తగ్గని సీఎం కేసీఆర్ విధులకు హాజరుకాని కార్మికులని ఉద్యోగాల నుంచి తొలగించి…కొత్తవారిని నియమించడానికి సిద్ధమయ్యారు. అయితే టీఆర్ఎస్ నేత కె కేశవరావు మధ్యవర్తిత్వం చేసి కేసీఆర్ తో మాట్లాడిస్తానని కార్మికులకు మాట ఇచ్చారు.

ఓ వైపు ఆ కార్యక్రమం జరుగుతుండగానే జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె వెనుక ఉన్నది మావాళ్లే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు ఆజ్యం పోస్తుంది తమవాళ్లే అని, ఆర్టీసీ సమ్మె వెనుక తమ పార్టీ వాళ్లే ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయన్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. ఎవరెవరు ఆర్టీసీ సమ్మెకు ఆజ్యం పోస్తున్నారన్న వివరాలు పేర్లతో సహా తన దగ్గర లిస్ట్ ఉందని ముత్తిరెడ్డి ఆఫ్ ద రికార్డ్‌లో అన్నారు.

ఒకవేళ ముత్తిరెడ్డి అన్నట్లు ఆర్టీసీ సమ్మె వెనుక సొంత పార్టీ నేతలు ఉంటే వారిపై సీఎం కేసీఆర్ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ముత్తిరెడ్డి వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరుంది. గతంలో ఆయన జనగామ కలెక్టర్‌తో కూడా భూమి విషయంలో కూడా గొడవపడ్డారన్న వివాదాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే తెలంగాణ గవర్నర్ తమిళిసైకు ఢిల్లీ నుంచి పిలుపు అందింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో గవర్నర్‌కు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న గవర్నర్ తమిళిసై… మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ప్రధానితో భేటీ అనంతరం సాయంత్రం 4 గంటలకు గవర్నర్ తమిళిసై హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ అంశంపై గవర్నర్ తమిళిసై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Leave a Reply