రేవంత్…. దమ్మూధైర్యం ఉంటే నాపై గెలువు….

Share Icons:

కొడంగల్, 9 అక్టోబర్:

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేసి గెలవాలని టీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి  సవాల్ విసిరారు. ఈరోజు కొడంగల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి రెండు దఫాలు రేవంత్ రెడ్డి విజయం సాధించారని, రేవంత్ రెడ్డి చేసే తప్పుడు ప్రచారాన్నికొడంగల్ ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరని ఆయన అభిప్రాయపడ్డారు.

Image result for patnam narender reddy and revanth redy

కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే  తాను సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్టు  రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకొంటున్నారని చెప్పారు. ఈ ప్రచారాన్ని నమ్మి ప్రజలు తనకు ఓట్లు వేస్తారని రేవంత్ రెడ్డి భ్రమలో ఉన్నారని పట్నం నరేంద్ర్ రెడ్డి చెప్పారు.

ఇక తనను ఓడించేందుకు డీజీపీ, కేసీఆర్‌ వంద కోట్లు డీల్ కుదుర్చుకొన్నారని రేవంత్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రేవంత్‌ను ఓడించేందుకు సీఎం ప్లాన్ చేస్తాడా అని ఆయన ప్రశ్నించారు.

 రేవంత్ రెడ్డి వల్లే కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కాలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.300 కోట్లతో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు  పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు.

మామాట: డిసెంబర్ 11న తెలిసిపోతుందిలే గెలుపు ఎవరిదో…

Leave a Reply