TRENDING NOW

టీఆర్ఎస్ కార్యకర్తని దారుణంగా హతమార్చిన ప్రత్యర్ధులు….

టీఆర్ఎస్ కార్యకర్తని దారుణంగా హతమార్చిన ప్రత్యర్ధులు….
Views:
125

వికారాబాద్, 6 నవంబర్:

తెలంగాణ ఎన్నికల వేళ వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తని ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. పరిగి మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన ఫిరంగి నారాయణ రెడ్డి అధికార పార్టీ నాయకుడు. నార్ మ్యాక్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఇటీవల నారాయణ రెడ్డికి గ్రామంలో కొంతమంది యువకులతో గొడవ జరిగింది. దీంతో నారాయణ వర్గానికి చెందిన కొంతమంది యువకులు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య వైరం మరింత పెరిగింది. ఈక్రమంలో పొలానికి వెళ్తున్న నారాయణపై గ్రామానికి చెందిన కొంతమంది యువకులు కర్రలు రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నారాయణ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ప్రతీకారం తీర్చుకోవడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలవ్వగా వారికి చికిత్స అందిస్తున్నారు.

మామాట: ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి….

(Visited 144 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: