ఒకరిది రెండు కళ్ల సిద్ధాంతం.. ఇంకొకరిది కళ్లు కొట్టే సిద్ధాంతం…

Share Icons:

మెదక్, 29 అక్టోబర్:

తెలుగు వారి ఆత్మ గౌరవం ఢీల్లీకి తాకట్టు పెట్టకూడదనే ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, అలాంటి టీడీపీ.. కాంగ్రెస్‌తో పొత్తు ఎలా పెట్టుకుందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఇందులో ఒకరిది రెండు కళ్ల సిద్ధాంతం.. ఇంకొకరిది కళ్లు కొట్టే సిద్ధాంతమని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కావాల్సింది కళ్లలో పెట్టుకొని చూసుకొనే సిద్ధాంతమన్నారు.

తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలు గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వ్యవహరిస్తున్నారన్నారు.

రమణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని విమర్శించారు. ఏపీ భవన్ లో చంద్రబాబు గది ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు కట్టుకొని నిలబడ్డారని ఆరోపించారు.

మామాట: మరి మీరు ఈ నాలుగున్నరేళ్లలో ప్రజలని ఏ మాత్రం కళ్ళలో పెట్టుకుని చూసుకున్నారో….

Leave a Reply