హుజూర్ నగర్ లో త్రిముఖ పోరు తప్పదా?

trs-congress-bjp-to-fight-for-prestige-in-telanganas-huzurnagar-bypolls
Share Icons:

హైదరాబాద్: తెలంగాణ హుజూర్ నగర నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నెల 23 నుంచి 30 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 1న నామినేషన్లు పరిశీలిస్తారు. అక్టోబర్ 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అక్టోబర్ 21న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక జరగనుంది. అదే నెల 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి…మొన్న ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా విజయం సాధించారు. దీంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇది కాంగ్రెస్ కంచుకోట కావడంతో..బలమైన అభ్యర్ధిని నిలపాలని కాంగ్రెస్ ఉత్తమ్ భార్య పద్మావతిని బరిలోకి దింపింది. అటు టీఆర్ఎస్ తరుపున గత ఎన్నికల్లో ఓడిపోయిన సైదిరెడ్డిని పోటీలో ఉంచింది. హుజూర్ నగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డి ఎంపిక దాదాపు ఖరారయింది.

అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తెలంగాణలో రోజు రోజుకు కాంగ్రెస్ బలహీనమవుతోంది. ఈ తరుణంలో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తోంది. మరో వైపు తెలంగాణలో బీజేపీ లేదంటూ టీఆర్ఎస్ విస్రృత ప్రచారం చేస్తోంది. కాని తెలంగాణలో బీజేపీ ఉందని అందుకే నాలుగు పార్లమెంటు సీట్లలో పాగావేశామని చెబుతున్నారు కాషాయ నేతలు. అప్పుడు కాదు ఇప్పుడు చూపండి మీ తడఖా అంటూ గులాబీ నాయకులు సవాలు విసురుతున్నారు.  టీఆర్ఎస్ మాత్రం హుజూర్ నగర్ లో కారు గెలిస్తేనే అభివృద్ధి ఉంటుందంటూ ప్రచారం మొదలెట్టింది.

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ గెలిచినా ప్రయోజనం ఏమీ ఉండదని కేటీఆర్ జనాల్లోకి వెళ్లిపోతున్నారు. అటు కాంగ్రెస్ హుజూర్ నగర్ తమ కంచుకోటని నిరూపించుకుని ప్రయత్నం చేస్తోంది. ఇక తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ఇదొక అవకాశ,. తమ బలం పెరిగిపోతుందన్న ఆశాల్లో ఉన్న బీజేపీ సత్తా ఏంటో ఈ ఎన్నికల్లో తెలిసిపోతుంది. మొత్తం మీద ఇక్క త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply