ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్: టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల సమావేశాలు

Share Icons:

హైదరాబాద్, 11 మే:

తెలంగాణలో ఖాళీ అయిన నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 14న అభ్యర్ధుల నామినేషన్‌కి చివరి తేదీ. అందువల్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభించారు.

కేసీఆర్ ఈరోజు కొందరు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈరోజు భేటీలో అభ్యర్ధులని ఖరారు చేయనున్నారు. ఇక మూడు స్థానాల్లో గెలవాలని కేసీఆర్ నేతలకి సూచించారు.

అటు  కాంగ్రెస్ సైతం స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయి చర్చించబోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది.

దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి రామచంద్ర కుంతియాతోపాటూ పార్టీ సీనియర్ నేతలు హాజరుకాబోతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలా లేక… పోటీకి దిగేటట్లైతే, ఎవరిని అభ్యర్థులుగా ఎంచుకోవాలనేదానిపై సమావేశంలో చర్చించబోతున్నారు.

మామాట: మరి ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అవుతాయో పోటీ ఉంటుందో

 

Leave a Reply