త్రిపుర‌లో ఘ‌న విజ‌యం…అస‌లు విష‌యం ఇది!

Share Icons:

త్రిపుర‌లో ఘ‌న విజ‌యం…అస‌లు విష‌యం ఇది!

త్రిపుర‌లో బిజెపి గెలిచిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో బిజెపి అనుకూలురు చేస్తున్న ప్ర‌చారం అంతా ఇంతా కాదు. దేశం మొత్తం బిజెపి ఆక్ర‌మించేసిన‌ట్లు, భార‌త దేశ చిత్ర ప‌టం నుంచి క‌మ్యూనిస్టులను బ‌య‌ట‌కు త‌న్నేసిన‌ట్లు గ‌త రెండు రోజులుగా వాట్స‌ప్‌లో చిత్రాలు కో కొల్ల‌లుగా వ‌చ్చేస్తున్నాయి. దేశంలో క‌మ్యూనిస్టుల‌కు నూక‌లు చెల్లిన‌ట్లు బిజెపి చేస్తున్న ప్ర‌చారం ఎప్పుడు ఆగుతుందో తెలియ‌దు.

బ‌హుశ మ‌ళ్లీ లోక్‌స‌భ ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కూ జ‌రుగుతుందేమో. దేశం నుంచి క‌మ్యూనిస్టుల‌ను వెళ్ల‌గొట్టిన‌ట్లు బిజెపి చేసుకుంటున్న ప్ర‌చారం వారికి ఆనందం క‌లిగిస్తుందేమో తెలియ‌దు కానీ ఒక విధ‌మైన భావ‌జాలమే దేశం మొత్తం ఉండాల‌నుకోవ‌డం అత్యాశే అవుతుంది.

కాంగ్రెస్ ముక్త భార‌త్ అని క‌మ‌ల‌నాధులు నినాదం ఇచ్చిన‌పుడే మిగిలిన అన్ని పార్టీలు క‌లిసి ఇలాంటి పిలుపునివ్వ‌డం త‌ప్పు అని ప్ర‌తిఘ‌టించి ఉన్న‌ట్ల‌యితే ఇప్పుడు క‌మ్యూనిస్టుల‌కు ఈ దుర్గ‌తి ప‌ట్టిఉండేది కాదు. దేశంలో క్ర‌మంగా వామ‌ప‌క్ష భావ‌జాలం అంత‌రిస్తున్న‌ద‌న‌డంలో సంశ‌యం లేదు కానీ అలాంటి ప‌రిస్థితి వేగంగా వ‌చ్చేయాల‌నుకోవ‌డం మంచిది కాదు. ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి గెలవ‌డానికి కార‌ణాలు ఏవైనా గెలిచారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అక్క‌డి జ‌నాభా ఎంత‌? ఓట‌ర్లు ఎంత‌?

బిజెపికి వ‌చ్చిన మెజారిటీ ఎంత‌? ఈ లెక్క‌లు ఒక్క సారి చూస్తే మ‌న‌కు నిజం అర్ధ‌మైపోతుంది. త్రిపుర‌లో 53 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌న్నీ క‌లిపితే ఉన్న‌ది కేవ‌లం 19 లక్షల మంది ఓటర్లు మాత్ర‌మే. త్రిపుర లో బిజెపి గెలిచిన స్దానాలు..35 ఈ స్థానాల‌లో బిజెపి పొందిన ఓట్లు… 9,79,376 . సిపియం గెలిచిన స్దానాలు..16 అక్క‌డి వారు పొందిన ఓట్లు..9,75,221.

బిజెపి,సిపియం ల మద్య ఓట్ల తేడా కేవలం..4,155 మాత్ర‌మే. అంటే కేవ‌లం 0.3% ఆధిక్యత. ఇంత మాత్రం దానికి దేశంలో బిజెపి ఎంత రాద్ధాంతం చేస్తున్న‌ది? ప్రతీ 60 మంది ఓటర్లకూ ఒక ప్రచారక్ చొప్పున రెండేళ్ళు ఫోకస్ చేసిన ఫలితం ఇది. బిజెపి సాధించిన విజ‌యాన్ని చిన్న‌త‌నంతో చూడ‌డం కాదు. ఒక్క ఓటైనా ల‌క్ష ఓట్ల‌యినా గెలుపు గెలుపే. అందులో ఎలాంటి సందేహం లేదు. బిజెపి గెలిచిన విష‌యాన్ని ఎవ‌రూ క‌ద‌న‌లేరు. అయితే విర్ర‌వీగ‌డం మాత్రం మంచిది కాదు.

English Summery: BJP favored media creating hype of recent Tripura assembly elections victory.

Leave a Reply