తిరుపతిలో త్రిముఖ పోరు….

Share Icons:

తిరుపతి, 21 మార్చి:

తిరుపతిలో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుంది.  వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, జనసేన నుంచి చదవలవాడ కృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు. ఇక వీరిద్దరు గతంలో టీటీడీ ఛైర్మన్‌లుగా చేయడం విశేషం. వీరితో పాటు టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006లో టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. చదలవాడ కృష్ణమూర్తి 2015లో దేవస్థానం బోర్డు చైర్మన్‌గా సేవలు అందించారు.

తిరుపతిలో బలమైన బలిజ సామాజికవర్గానికి చెందిన చదలవాడ కృష్ణమూర్తి గతంలో టీడీపీలో ఉన్నారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ మీద అవినీతి ఆరోపణలు చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీలో చేరారు.

2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఎం.వెంకటరమణ వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డిపై విజయం సాధించారు. కానీ రమణ అనారోగ్యం కారణంగా చనిపోవడంతో వెంకటరమణ భార్య సుగుణమ్మ ఉపఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే ఇక్కడ ముగ్గురు అభ్యర్ధులు స్ట్రాంగ్‌గా ఉండటంతో… ముక్కోణపు పోటీ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ ట్రైయాంగిల్ ఫైట్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో.

మామాట: తిరుపతి పోరు రసవత్తరంగా ఉంది

Leave a Reply