కేబుల్ వినియోగదారులకు శుభవార్త: రూ. 130కి 200 ఛానెల్స్

Cable- TV- bill-to grow up
Share Icons:

ముంబై: కొత్త సంవత్సరం సందర్భంగా టెలికమ్‌ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్) కేబుల్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. 2020, మార్చి 1 నుంచి కొత్త టారిఫ్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులపై తగ్గనున్న టారిఫ్‌ భారం తగ్గనుంది. న్యూ టారిఫ్‌ సేవలకు ట్రాయ్‌ సవరణలు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ట్రాయ్‌ జారీ చేసింది. దీనివల్ల వినియోగదారులు ఇకపై 200 ఫ్రీ టూ ఎయిర్‌ ఛానెల్స్‌ రూ. 130 కే పొందవచ్చు. ఇప్పటివరకు 130 రూపాయలకు 100 ఛానెల్స్‌ మాత్రమే వచ్చేవి.

దీనికి సంబంధించి.. ఎంఎస్‌వోలకు ట్రాయ్‌ కొత్త గైడ్‌లైన్స్‌‌ను కూడా విడుదల చేసింది. నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజును రూ.130కి ఫిక్స్ చేసింది. ఇప్పటి వరకు ఉచితంగా వచ్చే 100 ఫ్రీ ఎయిర్ ఛానెల్స్‌కి బదులు 200 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఇవ్వాలని సూచించింది. అంతేకాదు.. 200కు మించి ఎన్ని ఫ్రీ ఛానల్స్‌కి అయినా.. రూ.160కి మించి చెల్లించనక్కర్లేదని స్పష్టం చేసింది. అలాగే 26 డిడి చానల్స్ టారీఫ్‌లో కాకుండా అదనమని ట్రాయ్‌ పేర్కొంది.

అదేవిధంగా ఇప్పటి వరకు ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంటే.. రెండింటికి ఒకే ధరను వసూలు చేసేవారు. కానీ కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం. ఇంట్లో రెండో టీవీ ఉంటే దానికి నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు.. 40 శాతం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ కొత్త గైడ్‌లైన్స్‌ను ఈ జనవరి నెలాఖరు నాటికి వెబ్‌సైట్‌లో ఉంచాలని, మార్చి 1నుంచి వీటిని అమలు చేయాలని ఎంఎస్‌వోలను ట్రాయ్ ఆదేశించింది. అలాగే బ్రాడ్ కాస్టర్లు విధించే చానల్ గరిష్ఠ ధరను.. రూ.19 నుంచి రూ. 12కు తగ్గించింది. మొత్తానికి సవరించిన ధరలతో కేబుల్ వినియోగదారులకు పెద్ద ఊరట లభించినట్లైంది.

 

Leave a Reply