టీవీ ప్రేక్షకులకు ఊరట కలిగించే వార్తని చెప్పిన ట్రాయ్..

Share Icons:

ఢిల్లీ, 14 జనవరి:

టీవీ ప్రేక్షకులకు ఊరట కలిగించే ఓ వార్తని ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ) చెప్పింది. కేబుల్ అయినా, డీటీహెచ్ అయినా నెలకు రూ.153.40 (జీఎస్టీతో కలిపి) చెల్లించి వంద ఉచిత చానళ్లు లేదా ప్రేక్షకులు కోరుకునే 100 పెయిడ్ చానళ్ళని చూడొచ్చని ట్రాయ్ తెలిపింది. 

ఇక ఈ కొత్త రూల్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతుందని, అయితే జనవరి 31 కంటే ముందే చానళ్లు ఎంచుకోవాల్సి ఉంటుందని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. కానీ ట్రాయ్ ప్రకటన ప్రకారం ఈ బేసిక్ ప్యాకేజీలో హెచ్‌డీ క్వాలిటీవి ఉండవు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఉంటాయని అంటున్నాయి.

కాగా, ఈ నెలాఖరులోగా సర్వీసు ప్రొవైడర్లను సంప్రదించి, ప్రేక్షకులు తమకు కావాల్సిన చానళ్లను తెలియజేయాలని తెలిపింది. ఈ ప్రక్రియలో ఏమైనా సందేహాలుంటే 011-23237922 (ఏకే భరద్వాజ్), 011-23220209 (అరవింద్ కుమార్) లను సంప్రదించాలని ట్రాయ్ తెలిపింది.

మామాట: పోనిలే కొత్త ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించే వార్తని చెప్పారు…

Leave a Reply