పియాగో ఆటో డ్రైవర్లపై టాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలి..!

Share Icons:

హైదరాబాద్, 7 ఫిబ్రవరి:

పొట్ట కూటి కోసం హైద‌రాబాద్‌ నగరానికి వచ్చి జీవితం గడుపుకుంటున్న త‌మ‌ను ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నార‌ని, ఆటోలు న‌డుపుకునే త‌మ‌పై పోలీసులు జులూం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని, బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడున్నారని, భారీ చలాన్లు వేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేద‌న చెందుతున్నారు.

త‌మ‌ను వేధిస్తున్న పోలీసుల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏ.ఐ.వై.ఎఫ్ నగర అధ్యక్షుడు షేక్ నదీమ్ ఆధ్వర్యంలో పియాగో ఆటో డ్రైవర్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.వి. శ్రీనివాస్‌రావును  కలసి వినతి పత్రం సమర్పించారు.

నగరంలో వివిధ ప్రాంతాల్లో తక్కువ దూరంలో పియాగో షేరింగ్ ఆటోలు నడుపుతూ తాము కుటుంబాలను పోషించుకుంటున్నామ‌ని వార‌న్నారు. అయితే త‌మ‌ను నిత్యం ట్రాఫిక్ పోలీసులు అడ్డుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

అదేమ‌ని ఎవరైనా ప్ర‌శ్నిస్తే భారీగా చలాన్లు వేసి వేధిస్తున్నారని, చలాన్లు కట్టని వారి ఆటోలని సీజ్ చేస్తున్నారని డ్ర‌యివ‌ర్లు వాపోయారు.

ఈ సందర్బంగా షేక్ నదీమ్ మాట్లాడుతూ… నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకోవ‌డం లేద‌ని, స్వయం కృషితో ఆటోలు నడుపుతూ బ్రతుకుతుంటే
ట్రాఫిక్ పోలీసుల వేధింపులు రోజు రోజుకు అధికం అవుతున్నాయని, వీటిని వెంటనే ఆపక పోతే వందలాది మంది డ్రైవర్లతో పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయ‌న హెచ్చరించారు.

auto drivers compained about traffic police harrasement

 

మామాట: ఆటో డ్రైవర్లు అంటే అలుసా…

English Summary: AIFY president Shek Nadhim gave notice to Hyderabad police commissioner VV. Srinivasarao along with piyago auto drivers about harassment on auto drivers by traffic police.

Leave a Reply