-టీ పి సి సి చీఫ్ ?? 

Share Icons:

టిపిసిసి అధ్యక్షుని ఎంపిక అదిష్టానానికి తలనొప్పి

 టీ పి సి సి చీఫ్ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంలో పార్టీ పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరక తర్జనభర్జన పడడం  ఆ పార్టీని మరింత బలహీనపరుస్తున్నది . కాంగ్రెస్ పని అయిపోయింది ఇక  లాభం లేదనుకునేవారు  గోడదూకేందుకు తహతహ లాడుతున్నారు . ఇప్పటికే పలువురు పార్టీ వీడేందుకు సిద్దపడగా మరికొందరు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. . కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులు గ్రూపులుగా విడిపోయారు . ఒకరు కాదు ఇద్దరు కాదు అరడజనుకు పైగానే ఆద్యక్ష స్థానం కోసం వెంపర్లాడుతున్నారు.                                             రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి , రేవంత్ రెడ్డి ,తూర్పు జగ్గారెడ్డి , డి. శ్రీధర్ బాబు , అంజన్ కుమార్ యాదవ్ ముందున్నారు., మల్లు భట్టి విక్రమార్క , జానారెడ్డి లాంటివారు మాత్రం అధిష్ఠానం పిలిచి పదవి ఇస్తే సిద్ధంగా ఉన్నారు. వారంపాటు హైదరాబాద్ లో మకాం వేసిన ఇన్ చార్జ్ మాణిక్కం ఠాకూర్  దాదాపు 170 మంది అభిప్రాయాలు సేకరించారు. అభిప్రాయ సేకరణ కేవలం ఒక తంతు మాత్రమేనని,  అదిష్ఠానం ఇప్పటికే రుండు పేర్లు సిద్ధంచేసి, వారిలో చివరి నిమిషంలో ఒక పేరు  ప్రకటిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో చివరగా మళ్ళీ ఎవరి ప్రయత్నాలు వారు ఆరంభించారు.  దీంతో తన నిర్ణయమేమీ లేదని, అభిప్రాయాలన్నీ  అధిష్టానానికి అందిస్తానని  వారిదే తుది నిర్ణయమని చేతులు దులుపుకున్నారు.

ప్రజాభి మానం అధికారం లేకున్ కాంగ్రెస్ లక్షణాలు మారవని, కిందిస్థాయి కార్యకర్తలు నవ్వుకుంటున్నారు. టి పీ సి సి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ రాజీనామా చేయడంతో అధ్యక్ష ఎంపిక అనివార్యం అయింది . కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎంపిక భాద్యతను కొత్తగా రాష్ట్ర ఇన్ చార్జి ఠాకూర్ కు అప్పగించింది. చివరి రోజు అభిప్రాయ సేకరణ ఒక డ్రామా అని భావించి కాంగ్రెస్ సీనియర్లు సమావేశమై మరోపార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా  వచ్చినవాళ్లకు ఎట్టి పరిస్థిలోను అధ్యక్ష పదవి అప్పగించరాదని పట్టుబడుతున్నారు. ఆధ్యక్ష పదవికోసం పోటీపడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్ బాబు , జగ్గారెడ్డి తదితరులు సోనియా , రాహుల్ ను కలిసేందుకు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు కానీ,  కాంగ్రెస్ అధిష్టానం సీనియర్లను బుజ్జగించే పనిలో పడింది .

కొత్త టీ పి సి సి చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు కు మొగ్గుచూపుతున్నట్లు  తాజా సమాచారం. రాష్ట్రనేతలను సంప్రదించి వారిని ఒప్పించిన తరువాతనే అధ్యక్షుని పేరు అధికారికంగా ప్రకటించేందుకు సమయం పట్టవచ్చునని భావిస్తున్నారు.

-నందిరాజు రాధాకృష్ణ 

Leave a Reply