అసెంబ్లీని టీఆర్ఎస్ భవన్‌కో, ప్రగతి భవన్‌కో మార్చుకో: ఉత్తమ్

అసెంబ్లీని టీఆర్ఎస్ భవన్‌కో, ప్రగతి భవన్‌కో మార్చుకో: ఉత్తమ్
Views:
24

ఇది అప్రజాస్వామిక చర్య: జానారెడ్డి

హైదరాబాద్, 13 మార్చి:

టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేల అందరినీ సస్పెండ్ చేయడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్‌లో నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ సభ్యులకు ఒక న్యాయం, అసెంబ్లీలో నిరసన తెలిపే కాంగ్రెస్ సభ్యులకు మరో న్యాయాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పార్లమెంట్ లో ప్రతిపక్షం ఉండవచ్చుగానీ, రాష్ట్ర అసెంబ్లీలో ఉండరాదన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

ఇక అసెంబ్లీని టీఆర్ఎస్ భవన్‌కో, ప్రగతి భవన్‌కో మార్చుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. కౌన్సిల్ చైర్మన్ కు జరిగిన ఘటన బూటకమని, కేసీఆర్ ఆడిన నాటకమని ఆరోపించారు.

అనంతరం కాంగ్రెస్ పక్ష నేత కె జానారెడ్డి మాట్లాడుతూ… అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా మొత్తం ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయడాన్ని అప్రజాస్వామిక చర్యగా వ్యాఖ్యానించారు. కనీసం సభను వీడేముందు తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.

ప్రజా సమస్యలను చర్చించే ధైర్యం లేకనే, తమను బయటకు వెళ్లగొట్టారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా సంయమనం పాటించిన తనను, తనతో పాటు కుర్చీలో నుంచి లేయను కూడా లేయని షబ్బీర్ అలీని సస్పెండ్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

మామాట: అధికారంలో ఉన్నవారికి ప్రతిపక్షాలను ఏదోవిధంగా అణిచి వేయడం మామూలేగా….

English summary:

TPCC Chief Uttam Kumar Reddy fires on the TRS government has suspended all Congress MLAs from Telangana Assembly. Janareddy said suspension of the entire opposition in the assembly against the law was interpreted as an undemocratic act.

(Visited 19 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: