చిలుకూరు బాలాజీ దర్శనానికి టూర్ ప్యాకేజి

tour-packages-chilkuru balaji-telangana
Share Icons:

హైదరాబాదు, ఆగస్టు 28,

చిలుకూరు బాలాజీ దర్శనానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ‘చిలుకూరు బాలాజీ దర్శన్’ పేరుతో ప్రారంభించిన ఈ ప్యాకేజీ ద్వారా ఒకరోజులో చిలుకూరు ఆలయంతో పాటు మృగవని నేషనల్ పార్క్, లోటస్ పార్క్‌లను చూసిరావచ్చు. మధ్యాహ్నం భోజన ఖర్చు కూడా పర్యాటక శాఖదే. 

ఈ ప్యాకేజీ ద్వారా ఏసీ లేదా నాన్ ఏసీ బస్సును బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఏసీ బస్సులో వెళ్లేందుకు పెద్దులు రూ.700, పిల్లలు రూ.560 చెల్లించాలి. నాన్ ఏసీ బస్సుకు పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.450 చెల్లించాలి. ఈ బస్సులు రోజూ హైదరాబాద్‌లోని పర్యాటక శాఖ కార్యాలయం నుంచి ఉదయం 7 గంటలకు బయల్దేరి, రాత్రి 9 గంటలకు తిరిగి వస్తాయి. పూర్తివివరాలకు తెలంగాణ పర్యాటక శాఖ వెబ్ లో చూడవచ్చు.

వెబ్ చిరునామా:     http://www.telanganatourism.gov.in/partials/packages/tour-packages.html

 

మామాట :  భగవంతుని దర్శనం కూడా మార్కెటింగ్ వస్తువైంది.

Leave a Reply