ఆసక్తికరంగా ఖమ్మం పోరు…

Share Icons:

ఖమ్మం, 19 మార్చి:

తెలంగాణలో ఖమ్మం లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తరపున,  కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి పోటీచేయనున్నట్లు సమాచారం.  ఒకవేళ అదే నిజమైతే… ఇద్దరూ బలమైన నేతలు కావడం..అందులోనూ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే కావడంతో  ఇరువురి ఫైట్ ఉత్కంఠ రేపనుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి… టీడీపీ నుంచి బరిలోకి దిగి నామా నాగేశ్వరరావుపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.

అయితే 2004, 2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి రేణుకా చౌదరి (కాంగ్రెస్), నామానాగేశ్వరరావు (టీడీపీ) తలపడ్డారు. 2004లో రేణుకా చౌదరి విజయం సాధించగా.. 2009లో నామానాగేశ్వరరావు గెలుపొందారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇద్దరు నేరుగా పోటీపడబోతున్నట్లు తెలుస్తోంది.  గతంలో రేణుకా చౌదరి కాంగ్రెస్ నుంచి పోటీచేయగా..నామా నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నారు. కానీ నామా టీఆర్ఎస్ వైపుకు వెళ్లారు.

డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వన్ సైడ్ వార్ జరిగి..భారీ మెజార్టీతో కారు గెలిచింది. అయితే ఖమ్మంలో మాత్రం తన సత్తాచూపలేకపోయింది టీఆర్ఎస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఒకే ఒక్క స్థానాన్ని గెలిచింది. కానీ ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌తో కలిశారు. ఇక తాజాగా నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరబోతుండడం…రేణుకా చౌదరిపై పోటీచేయనున్న నేపథ్యంలో ఖమ్మంలో టఫ్ ఫైట్ జరగబోతోంది. మరి ఖమ్మంలో పాగా వేయాలని చూస్తున్న టీఆర్ఎస్ కల నెరవేరుతుందో లేదో చూడాలి.

మామాట: మళ్ళీ పాత ప్రత్యర్ధులే అనమాట…

Leave a Reply