తణుకులో టఫ్ ఫైట్…

Share Icons:

ఏలూరు, 22 మార్చి:

ఈ సారి తణుకులో టఫ్ ఫైట్ జరగనుంది. తెదేపా నేత అరిమిల్లి రాధాకృష్ణ, వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావుల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. గత ఎన్నికల్లో అరిమిల్లి రాధాకృష్ణ  తణుకు  టీడీపీ టికెట్ దక్కించుకుని గెలుపు బావుటా ఎగరవేశారు. ఈ సారి ఎన్నికల్లో కూడా చంద్రబాబు అరిమిల్లికే టికెట్ కేటాయించారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన కారుమూరి నాగేశ్వ‌ర‌రావు మళ్ళీ తణుకు వైసీపీ బరిలో ఉన్నారు. ఇప్పటికే వీరు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లుతున్నారు.

రాధాకృష్ణ ఈ ఐదేళ్లలో అభివృద్ధి బాగానే చేశారు. ప్ర‌తీ ప‌ల్లెకి రోడ్లు ప‌డ్డాయి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి అందేలా చేశారు. అలాగే 2018లో ఏపీలో ఉత్తమ ఎమ్మెల్యేల జాబితాలో అరిమిల్లి మొదటిస్థానంలో నిలిచారు. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈసారి ఎన్నికలు ఉండవు. ఇక్కడ వైసీపీ, జనసేనలు బలంగా ఉన్నాయి. 

కారుమూరికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టుంది. వ్యక్తిగతంగా ఎలాంటి మచ్చ లేని వ్యక్తి కావడంతో ఆయనకి మద్ధతుదారులు కూడా ఎక్కువే ఉన్నారు. పైగా వైకాపా ఈ సారి బలంగా ఉంది. ఇక జ‌న‌సేన నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన పసుపులేటి వెంకటరామారావు పోటీ చేస్తున్నారు.  జనసేన ఓట్లని ఎక్కువగా చీల్చే అవకాశం ఉంది. మరి ఈ చీలిక ఎవరికి కలిసొస్తుందో చూడాలి.

ఈ నియోజకవర్గంలో క‌మ్మ‌, కాపు సామాజిక‌వ‌ర్గాలు ఎక్కువ. వీరే గెలుపు ఓట‌ములను డిసైడ్ చేస్తారు అనే చెప్పాలి. మరి ఈ సారి తణుకు టఫ్ ఫైట్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో

మామాట: ప్రజామద్ధతు ఉన్న నేతకే పట్టం కడతారు…

Leave a Reply