TRENDING NOW

కృష్ణాలో టఫ్ ఫైట్…..

కృష్ణాలో టఫ్ ఫైట్…..

విజయవాడ, 14 మార్చి:

కులాల రచ్చ ఎక్కువగా ఉండే కృష్ణాజిల్లాలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనేది ఊహాకి అందకుండా ఉంది. రాజధానికి దగ్గరగా ఉన్న ఈ జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇక  2014 ఎన్నికల్లో టీడీపీ అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది.. రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది..16 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 10 స్థానాలను కైవసం చేసుకుంటే, వైసీపీ ఐదు, బీజేపీ1 గెలుచుకుంది. ఇక వైసీపీ నుండి విజయవాడ వెస్ట్ నుంచి గెలిచిన జలీల్ ఖాన్, పామర్రు నియోజకవర్గం నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరారు.. అలాగే జిల్లాలో టీడీపీ పట్టు నిలుపుకునేందుకు ముగ్గురికి కేబినెట్ లో స్థానం కల్పించింది.

అయితే గత ఎన్నికల నాటి పరిస్థితి ఈసారి కృష్ణాజిల్లాలో లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో బీజేపీ,జనసేన రెండు టీడీపీకి మద్దతు ఇవ్వటం వల్ల అత్యధిక సీట్లు ఆ పార్టీ సాధించింది. ఈసారి ఈ మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆగే కృష్ణాజిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కులాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD

అలాంటి నియోజకవర్గాల్లో జనసేన ఓటింగ్ కీలకంగా మారనుంది. విజయవాడ ఈస్ట్, పెడన, కైకలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.. అలాగే పెడన, మైలవరం నియోజకవర్గాల్లో గౌడ సామాజిక వర్గం అభ్యర్థి విజయాన్ని శాసిస్తుంది. అలాగే ఆయా నియోజకవర్గాల్లో అధికంగా ఉన్న సామాజిక వర్గం వారు గెలుపుని ప్రభావితం చేస్తాయి.

ఇక టీడీపీ వచ్చిన ఈ ఐదేళ్లలో అభివృద్ధి బాగానే జరిగిందని తెలుస్తోంది. ఇక వ్యవసాయం మీదే ఎక్కువగా ఆదారపడే కృష్ణాజిల్లాలో ఈసారి పట్టిసీమ ప్రాజెక్ట్ పుణ్యమా అని రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ రుణమాఫీ సరిగా అమలు కాకపోవడంతో వలన ప్రభుత్వం మీద వ్యతిరేకిత ఉంది. అయితే కృష్ణానది ప్రవహిస్తున్న కృష్ణాజిల్లాలో చాలా చోట్ల తాగునీటికి ప్రజలు ఇప్పటికీ అల్లాడిపోతూనే ఉన్నారు. అటు మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రధాన అంశంగా ఉన్న పోర్టు పనులని ముఖ్యమంత్రి ఇటీవల్ ప్రారంభించినప్పటికీ అది ఎన్నికలముందు చేసిన హడావిడే తప్ప మరోకటి కాదు అనేది అక్కడి ప్రజలు చెబుతున్న మాట.

ఇక ఇక్కడ ఉన్న 16 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా తలపడనున్నాయి. అలాగే జనసేన కొన్ని స్థానాల్లో ప్రభావం చూపగలదు. మరి కృష్ణాలో ఎవరు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటారో చూడాలి. 

మామాట: హోరాహోరీ పోరులో పైచేయి సాధించేది ఎవరో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: