దేశంలో టాప్-10 ఇంజినీరింగ్ కాలేజీలు…

top-engineering-colleges-in-india
Share Icons:

ఢిల్లీ, 13 జూన్:

ఇంజినీరింగ్ పోటీ పరీక్షలలో మంచి ర్యాంకు తెచ్చుకున్న ఏ విద్యార్ధి అయిన టాప్ కాలేజీలో సీటు రావాలని కోరుకుంటాడు. అయితే అలా దేశంలో కొన్ని టాప్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. కానీ వాటిల్లో సీటు రావాలంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మంచి ర్యాంకులు సంపాందించుకున్న వారికే అది సాధ్యమవుతుంది.

కాగా, ప్రస్తుతం జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడితో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే ప్రతిష్ఠాత్మక ఐఐటీ,ఎన్ఐటీలలో ప్రవేశానికి దరఖాస్తుల పర్వం కూడా మొదలైంది. దీంతో త్వరలో ఇంజినీరింగ్ కోర్సులో చేరబోయే విద్యార్థుల కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దేశంలోని ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలల జాబితాను ‘ఇండియా ర్యాంకింగ్ రిపోర్టు 2018’ పేరిట తాజాగా విడుదల చేసింది.

ఈ రిపోర్టుని కాలేజీల నిర్వహణ, బోధన, అధ్యయనం, అందుబాటులో ఉన్న వనరులు, పరిశోధనల ప్రాతిపదికగా సర్వే చేసి దేశంలోని 2018వ సంవత్సరంలో టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలల జాబితాని రూపొందించారు.

ఇండియాలో టాప్-10 ఇంజినీరింగ్ కళాశాలలు…..

  • ఐఐటీ, మద్రాస్
  • ఐఐటీ,బాంబే
  • ఐఐటీ, ఢిల్లీ
  • ఐఐటీ, ఖరగ్ పూర్
  • ఐఐటీ,కాన్పూర్
  • ఐఐటీ రూర్కీ
  • ఐఐటీ, గౌహతి
  • అన్నా యూనివర్శిటీ, చెన్నై
  • ఐఐటీ, హైదరాబాద్
  • ఐసీటీ, ముంబై.

ప్రస్తుతం 2018 సంవత్సరంలో ఈ ఇంజినీరింగ్ కాలేజీలు టాప్-10 ర్యాంకుల ప్రకారం ముందున్నాయి. ఇక ఆ తర్వాత స్థానాల్లో వరుసగా 11. ఎన్ఐటీ, తిరుచనాపల్లి, 12, జాదవ్ పూర్ యూనివర్శిటీ, కోల్ కతా, 13.ఐఐటీ,ధన్ బాద్, 14. ఐఐటీ, ఇండోర్, 15. ఎన్ఐటీ, రౌర్కెలా, 16.వీఐటీ, 17. బిట్స్, పిలానీ, 18 ఐఐటీ, భువనేశ్వర్, 19. ఐఐటీ, వారణాసి, 20. థాపర్ ఐఈటీ, పాటియాలా.

21. ఎన్ఐటీ, సూరత్ కల్, 22. ఐఐటీ,రోపార్, 23. ఐఐఎస్‌ఎస్‌టీ, తిరువనంతపురం, 24. ఐఐటీ, పాట్నా, 25. ఎన్ఐటీ,వరంగల్, 26. బీఐటీ, రాంచీ, 27. ఐఐటీ,గాంధీనగర్, 28. ఐఐటీ, మండీ, 29. పీఎస్జీ ఇంజినీరింగ్ కళాశాల, కోయంబత్తూర్, 30. ఐఐఈఎస్ టీ, షీబ్ పూర్ (హౌరా) కాలేజీలు ఉన్నాయి.

మామాట: త్వరలో ఇంజినీరింగ్ విద్యార్ధుల సమాచారం కోసం…

Leave a Reply