మూడో టీ-20కి సీనియర్ బౌలర్లకి విశ్రాంతి…

West indies vs india second t-20 match
Share Icons:

ముంబై, 9 నవంబర్:

ఈ నెల 11 న వెస్టిండీస్‌తో జరగబోయే మూడో టీ20లో ఆడే భారత్ జట్టుని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఇప్పటికే సిరీస్ గెలవడంతో సీనియర్ బౌలర్లకు విశ్రాంతినిచ్చారు. ఉమేష్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్‌లకు రెస్ట్ ఇచ్చినట్లు బోర్డు వెల్లడించింది.

ఆస్ట్రేలియా టూర్‌కు ఈ ముగ్గురు బౌలర్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే మరో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ని జట్టులో కొనసాగించింది. ఇక చివరి టీ20 మ్యాచ్ కోసం సిద్ధార్థ్ కౌల్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

మూడో టీ20కి టీమ్ ఇదే:

రోహిత్ శర్మ, ధావన్, రాహుల్, కార్తీక్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్

మామాట: చివరి మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ పరిపూర్ణం అవుతుందిగా…

Leave a Reply