రేపు పాక్షిక సూర్యగ్రహణం

Share Icons:
కొత్త ఢిల్లీ, జనవరి 4,
కొత్త ఏడాది తొలివారంలోనే సూర్యగ్రహణం సంభవించనుంది. దీని తర్వాత 15 రోజులకు చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. అందుకే జనవరిని ఎంతో విశిష్టమైన నెలగా ఖగోళ, జ్యోతిష్య శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. జనవరి 6న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం ఈశాన్య ఆసియా, ఫసిఫిక్ తీరంలోనూ దర్శనమిస్తుంది. ఇండియాలో మాత్రం ఈ గ్రహణం కనిపించదు. చైనా, రష్యాలోని సైబీరియా, కొరియా ద్వీపం, జపాన్‌తోపాటు ఉత్తర ఫసిక్, ఆసియా ప్రాంతాల్లోనే దీని ప్రభావం ఉంటుంది. పదిహేను రోజుల వ్యవధిలోనే సంపూర్ణ చంద్రగ్రహణం అంటే జనవరి 21 న కనువిందు చేయనుంది. ఇది సెంట్రల్ పసిఫిక్, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లోనూ కనిపిస్తుంది.
ఈ ఏడాది మొత్తం ఐదు సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సంపూర్ణ సూర్యగ్రహణాలు, ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం. అలాగే, ఒకటి పాక్షిక చంద్రగ్రహణం, ఒకటి పాక్షిక సూర్యగ్రహణం. అలాగే పదమూడేళ్లకు ఒకసారి సూర్యుడి కక్ష్యను దాటి బుధుడు సంచరిస్తారు. ఇది ఏడాది నవంబరులో జరుగుతుంది. డిసెంబ‌ర్ 26, 2019 న ఏర్పడే  సూర్య గ్రహ‌ణం ద‌క్షిణ భార‌తదేశం, శ్రీలంక‌, కొన్ని గ‌ల్ఫ్ దేశాలు, సుమ‌త్రా, మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌లో క‌నిపించ‌నుంది. కానీ సంపూర్ణ సూర్యగ్రహణం కోసం మ‌రో 16 ఏళ్లు వేచి చూడాల్సిందే.మన దేశంలో సంపూర్ణ సూర్య‌గ్ర‌హ‌ణం 2034లో కనువిందు చేయనుంది.
ద‌క్షిణ ప‌సిఫిక్‌, అంటార్కిటిక్‌ ప్రాంతాల్లో సంపూర్ణ సూర్య గ్ర‌హణం రెండు లేదా మూడేళ్ల‌కోసారి వ‌స్తూనే ఉంటుంది. కానీ మ‌న ప్రాంతంలో మాత్రం చాలా అరుదుగా సంభవిస్తుంది. పాక్షిక సూర్యగ్రహణం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11: 34: 08 గంటలకు మొదలై తెల్లవారుజామున 3.49 గంటలకు వరకు ఉంటుంది. అంటే భారత కాలమాన ప్రకారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటలకు వరకు. ఇక, జపాన్‌లో ఉదయం 8.30 నుంచి 10.30 వరకు కనువిందు చేయనుంది.
మామాట: గ్రహణం ఒక ప్రకృతి చర్యం అంతే కదా

Leave a Reply