రేపు ఎన్టీయే మిత్రపక్షాలకు అమిత్‌ షా విందు

Share Icons:

కొత్తఢిల్లీ, మే 20,

నిన్న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత ఎన్టీయేన మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ చేపిన విషయం తెలిసిందే. అయితే ఈ సంతోషంలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాలకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రులు కూడా హాజ‌రుకానున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈనెల 23న వెలుబ‌డ‌నున్నాయి.

ఎక్కువ‌శాతం ఎగ్జిట్‌పోల్స్ ఎన్డీయే కూట‌మికి 300 సీట్లు దాటుతాయ‌ని అంచ‌నా వేశాయి. న్యూస్‌24 చాణ‌క్య స‌ర్వే ప్ర‌కారం ఎన్డీయేకు 350 సీట్లు రానున్నాయి. ఆజ్‌త‌క్‌ఇండియా టుడే ప్ర‌కారం 339 నుంచి 365 సీట్లు రానున్నాయి. న్యూస్‌18 ప్ర‌కారం 336 సీట్లు వ‌స్తున్నాయి.

మామాట- ఇక విందులు, పొత్తులు, కత్తులు దూయటమే కదా

Leave a Reply